‘ ఆ ఒక్కటి ‘ లేకుండానే ముగిసిన సమావేశాలు.. మరి… చర్చించిందేమిటి ?

ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఇద్దరూ మహాబలిపురంలో రెండు రోజులపాటు జరిపిన చర్చలు, నిర్వహించిన సమావేశాలు ముగిశాయి. లాంఛనంగా జరిగిన ఈ సమావేశాల్లో ఇద్దరూ ముఖాముఖీ, ఫ్రెండ్లీ భేటీలతో.. ఒకప్పటి ఈ పల్లవుల నగరానికి విశిష్టతను తెచ్చారు. భారత-చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, ఉగ్రవాద నిర్మూలన, సాంస్కృతిక సంబంధాలకు పెద్దపీట, కల్చరల్ టూర్, ఆర్ధిక, రక్షణ రంగాల్లో పరస్పర సహకార ధోరణి వంటి అంశాలే వీరి చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. […]

' ఆ ఒక్కటి ' లేకుండానే ముగిసిన సమావేశాలు.. మరి...  చర్చించిందేమిటి ?
Follow us

|

Updated on: Oct 13, 2019 | 11:59 AM

ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఇద్దరూ మహాబలిపురంలో రెండు రోజులపాటు జరిపిన చర్చలు, నిర్వహించిన సమావేశాలు ముగిశాయి. లాంఛనంగా జరిగిన ఈ సమావేశాల్లో ఇద్దరూ ముఖాముఖీ, ఫ్రెండ్లీ భేటీలతో.. ఒకప్పటి ఈ పల్లవుల నగరానికి విశిష్టతను తెచ్చారు. భారత-చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, ఉగ్రవాద నిర్మూలన, సాంస్కృతిక సంబంధాలకు పెద్దపీట, కల్చరల్ టూర్, ఆర్ధిక, రక్షణ రంగాల్లో పరస్పర సహకార ధోరణి వంటి అంశాలే వీరి చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. 2018 ఏప్రిల్ 27, 28 తేదీలలో చైనాలోని వూహాన్ లో జరిపిన సమ్మిట్ కు కొనసాగింపుగా ఈ ‘ చెన్నై కనెక్ట్ ‘ సమ్మిట్ ని పరిగణిస్తున్నారు. కాగా-అతి ముఖ్యమైన కాశ్మీర్ అంశం మాత్రం మోదీ, జిన్ పింగ్ చర్చల్లో ప్రస్తావనకు రాలేదని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే స్పష్టం చేశారు. ఈ ఉభయ నాయకులూ తప్పకుండా కాశ్మీర్ అంశంపై విస్తృత చర్చలు జరుపుతారని అంతా భావించారు. కానీ అసలు ఆ ఊసే లేదు. కాశ్మీర్ భారత-పాకిస్తాన్ అంతర్గత వ్యవహారమని చైనా అధ్యక్షుడు తమ ప్రభుత్వ వైఖరిని పరోక్షంగా వెల్లడించారు. ఇండియాకు వచ్ఛే ముందు ఆయనను పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కలుసుకున్న సంగతి తెలిసిందే.

కాశ్మీర్లో పరిస్థితిని తాము నిశితంగా గమనిస్తున్నామని జిన్ పింగ్..ఆ సందర్భంలో ఇమ్రాన్ ఖాన్ కు తెలిపారు. అలాగే ఇమ్రాన్ ఈ వారం మొదట్లో తనను కలిసిన విషయాన్ని ఆయన.. మోదీకి చెప్పారు. వివాదాలకు అతీతంగా వ్యవహరించాలని, సరిహద్దుల్లో శాంతి స్థాపనకు పరస్పర విశ్వాసాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని, ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు చర్చలు ప్రారంభించాలని ఉభయ నేతలూ నిర్ణయించారని విజయ్ గోఖలే పేర్కొన్నారు. ‘ చెన్నై కనెక్ట్ ‘ తో రెండు దేశాల మధ్య ఓ కొత్త సహకార శకం ప్రారంభమవుతుందని మోదీ ట్వీట్ చేశారు. ఇది ఉభయ దేశాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఇండియా-చైనా మధ్య సాంస్కృతిక సంబంధాల పెంపుదలకు అనువుగా 2020 సంవత్సరాన్ని పాటించాలని తీర్మానించారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు అయిన సందర్భంగా ‘ షిప్ వాయేజ్ ‘ (నౌకా యాన నిర్వహణ) పై ఓ కాన్ఫరెన్స్ తో బాటు మొత్తం 70 కార్యకలాపాలు నిర్వహించడానికి మోదీ-జిన్ పింగ్ అంగీకరించినట్టు తెలిసింది. అలాగే తమిళనాడు-ఫ్యూజియన్ ప్రావిన్స్ మధ్య ‘ లింకు ‘ ను ఏర్పాటు చేయడానికి అనువుగా జరిపే అధ్యయనం కోసం ఓ అకాడెమీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారట. ఉగ్రవాదం అన్నది ఓ ఉమ్మడి సమస్యగా మారిందని, దీనిపై పోరాటం చేయాలని భావించారు. మొత్తానికి అత్యంత ప్రధానమైన కాశ్మీర్ అంశం వీరి చర్చల్లో ప్రస్తావనకు రాలేదంటే దాన్ని వీరు ‘ లైట్ ‘ గా తీసుకున్నారని అర్థమవుతోంది.