Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

ఇక్కడ సమ్మె.. అక్కడ మద్దతు.. రంగంలోకి ఏపీఎస్ ఆర్టీసీ కూడా !

తెలంగాణలో ఉధృతంగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పక్క రాష్ట్రం ఏపీ నుంచి కూడా మద్దతు లభిస్తోంది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీఎస్ఆర్టీసీ నేతలు సీఎం కేసీఆర్‌కు విఙ్ఞప్తి చేశారు. ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో పలు డిపోలవద్ద ధర్నాలు చేపట్టారు. సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సీఎం కేసీఆర్ తమ మొండి వైఖరిని మానుకుని కార్మిక సంఘాలతో చర్చలు ప్రారంభించాలని కోరారు. అదే విధంగా ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా ఈ నెల 19న తెలంగాణ బంద్‌కు మద్దతుగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులంతా ఎర్రబ్యాడ్జీలు ధరించి సమ్మెకు సంఘీభావం తెలుపుతూ విధులకు హాజరవుతామని ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు వెల్లడించారు.

ఇదిలా ఉంటే టీఎస్ఆర్టీసీ యూనియన్లు తమ సంస్ధను ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇదే ప్రధాన డిమాండ్‌తో తెలంగాణలో కూడా ఇదే డిమాండ్‌తో ఆర్టీసీ జేఏసీ సమ్మెకు దిగింది. కార్మికులు చేస్తున్న సమ్మెపై టీఆర్ఎస్ ప్రభుత్వం మొట్టు దిగడం లేదు. కార్మికుల చేస్తున్న ప్రధాన డిమాండ్‌ పరిష్కారం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఏపీలో విలీనం చేయగా లేనిది ఇక్కడ ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సమ్మెకు దిగిన 48 వేలమంది కార్మికుల్లో ఏ ఒక్కరినీ తాము తొలగించలేదని, వారికి వారే స్వచ్ఛందంగాఉద్యోగాన్నివదులుకున్నారని ప్రభుత్వం చెబుతోంది. మరో మూడు రోజుల్లో వందశాతం బస్సులు రోడ్డెక్కుతాయని కూడా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే తాత్కాలికంగా కొన్ని బస్సులు నడుపుతున్నారు. మరోవైపు సమ్మెపై హైకోర్టులో వాదనలు కూడా జరుగుతున్నాయి.