బ్రేకింగ్: వివేకా హత్య కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు

మాజీ ఎంపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరికొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివేకాది సుపారీ హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ గ్యాంగ్ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 800మంది అనుమానితులను విచారించిన తరువాత సునీల్ గ్యాంగ్ కిరాతకం వెలుగుచూసింది. నిందితులు వాడిన బైక్ ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. వివేకా హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న శ్రీనివాస్ రెడ్డి […]

బ్రేకింగ్: వివేకా హత్య కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు
Follow us

| Edited By:

Updated on: Oct 13, 2019 | 3:05 PM

మాజీ ఎంపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరికొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివేకాది సుపారీ హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ గ్యాంగ్ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 800మంది అనుమానితులను విచారించిన తరువాత సునీల్ గ్యాంగ్ కిరాతకం వెలుగుచూసింది. నిందితులు వాడిన బైక్ ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు.

వివేకా హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందగా.. ఆయన మరణంతో అనుమానాలు పెరిగాయి. దీంతో ఆ కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేయగా.. మరికొన్ని నిజాలు బయటపడ్డాయి. వివేకా హత్య డీల్‌ను శ్రీనివాస్ రెడ్డి సునీల్ గ్యాంగ్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డి వెనుక ఉన్న పెద్దలపై.. వివేకా హత్యకు సుపారీ ఇచ్చిన వ్యక్తుల వివరాలపై ఆరా తీస్తున్నారు.

మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో వదంతులు నమ్మొద్దని ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. వివేకా హత్య కేసులో సునీల్ గ్యాంగ్ ప్రమేయంపై వార్తలు అవాస్తవమని.. ఎవరైనా అబద్ధపు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు.

కాగా ఈ ఏడాది మార్చిలో వైఎస్ వివేకా హత్యకు గురయ్యారు. మొదట గుండెపోటుతో ఆయన మరణించారని భావించినప్పటికీ.. ఒంటిపై ఉన్న గాయాలు, పోస్ట్ మార్టం నివేదికలో ఆయనది హత్య అని నిర్ధారణ అయ్యింది. దీంతో అప్పటి నుంచి పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.

Latest Articles