ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ కన్నుమూత

సీనియర్ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్(82) కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కర్నూల్ జిల్లా ఆదోనీకి చెందిన శ్రీను మాస్టర్.. ప్రముఖ కొరియోగ్రాఫర్ హీరాలాల్ దగ్గర శిష్యరికం చేశారు. 1969లో నిర్మాత డూండి రూపొందించిన నేనేంటే నేనే చిత్రంతో డ్యాన్స్ మాస్టర్‌గా శ్రీను ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. ఆ తరువాత మహా బలుడు, భక్త కన్నప్ప, దొరబాబు, ఎదురులేని మనిషి, యుగంధర్, యుగ పురుషుడు సహా మొత్తం 1700 చిత్రాలకు […]

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ కన్నుమూత
Follow us

| Edited By:

Updated on: Oct 13, 2019 | 12:37 PM

సీనియర్ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్(82) కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కర్నూల్ జిల్లా ఆదోనీకి చెందిన శ్రీను మాస్టర్.. ప్రముఖ కొరియోగ్రాఫర్ హీరాలాల్ దగ్గర శిష్యరికం చేశారు. 1969లో నిర్మాత డూండి రూపొందించిన నేనేంటే నేనే చిత్రంతో డ్యాన్స్ మాస్టర్‌గా శ్రీను ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. ఆ తరువాత మహా బలుడు, భక్త కన్నప్ప, దొరబాబు, ఎదురులేని మనిషి, యుగంధర్, యుగ పురుషుడు సహా మొత్తం 1700 చిత్రాలకు ఆయన పనిచేశారు. స్వర్ణ కమలం, రాధా గోపాలం, శ్రీరామరాజ్యం చిత్రాలకు గానూ బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా ఆయన నంది అవార్డులను అందుకున్నారు. కాగా ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు విజయ్ శ్రీనివాస్ ఉండగా.. విజయ్ శ్రీనివాస్‌ దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం చెన్నైలో శ్రీను మాస్టర్ పార్ధీవ దేహానికి ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు