Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

విటమిన్ బి6 ఆరోగ్య ప్రయోజనాలు…!

ఫైరిడాక్సిన్ ను B6 విటమిన్ అంటాము. ఇది మూడు రూపాలలో ఉంటుంది. అవి ఫైరిడాక్సిల్, ఫైరిడాక్సిమైన్, ఫైరిడాక్సిన్ లు. అవసరానికి బట్టి ఇవి శరీరంలో రూపాలను మార్చుకుంటూ ఉంటాయి. ఇది నీటిలో కరిగే విటమిన్. మన శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ బి6 కూడా ఒకటి.  మన శరీరంలో అనేక పనులకు ఈ విటమిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రోటీన్లు, ఫ్యాట్స్, కార్బొహైడ్రేట్ల మెటబాలిజంకు, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి విటమిన్ బి6 ఎంతో అవసరం ఉంటుంది. అయితే ఈ విటమిన్‌ను మన శరీరం స్వతహాగా తయారు చేసుకోలేదు. కనుక ఆహార పదార్థాల ద్వారానే మనం దీన్ని పొందాల్సి ఉంటుంది.

ఇక విటమిన్ బి6 మనకు తగినంతగా లభించకపోతే పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. చర్మంపై దద్దుర్లు వస్తాయి. పెదవులు పగులుతాయి. నాలుక, నోటి పూత వస్తుంది. డిప్రెషన్‌తో ఉంటారు. రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. నిస్సత్తువగా, అలసిపోయినట్లుగా ఫీలవుతారు. చేతులు, పాదాల్లో గుండు పిన్నులతో గుచ్చినట్లు అనిపిస్తుంది. కొందరికి ఫిట్స్ కూడా వస్తాయి. అయితే విటమిన్ బి6 ఉన్న ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటే పైన చెప్పిన అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

విటమిన్ బి6 మనకు ఎక్కువగా చేపలు, పిస్తాపప్పు, అరటిపండ్లు, అవకాడోలు, చికెన్, మటన్ లివర్, పాలకూర తదితర ఆహారాల్లో లభిస్తుంది. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా విటమిన్ బి6 లోపం రాకుండా చూసుకోవచ్చు. అలాగే గుండె జబ్బులు, క్యాన్సర్, కంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

నాడీ వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి, జీవక్రియలు సరిగా జరగడానికి విటమిన్ బి6, బి12 ఎంతో అవసరం. ఇవి కళ్లు, జుట్టు, కాలేయం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బి12 లోపిస్తే కంట్లో నరాలు దెబ్బతింటాయి. ఈ రెండు విటమిన్లు మాంసంలో అధికంగా లభిస్తాయి. పచ్చి శనగలు, మొలకలు, బచ్చలి కూర, ఎండు మిరపలోనూ ఈ విటమిన్లు ఉంటాయి.

శరీరంలో కొత్త కణాలు ఏర్పడేందుకు ఫోలిక్ యాసిడ్ సహాయపడుతుంది. ఇది లోపిస్తే అనీమియా రావడంతోపాటు పుట్టబోయే పిల్లల్లో లోపాలు తలెత్తుతాయి. కంటి నరాల్లో క్షీణత కనిపిస్తుంది. తోటకూర, పుదీనా, పాలకూర, పప్పు ధాన్యాలు, నట్స్, కాలేయంలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా లభిస్తుంది.