Breaking News
  • భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌.భారత్‌లో నిన్న 54,736 కరోనా కేసులు నమోదు, 853 మంది మృతి దేశవ్యాప్తంగా 17,50,724కు చేరిన పాజిటివ్‌ కేసులు.భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో 37,364 మంది మృతి.5,67,730 యాక్టివ్‌ కేసులు, ఇప్పటి వరకు 11,45,630 మంది డిశ్చార్జ్.
  • రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్ర శేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలలో సమర్దవంతమైన, కచ్చితమైన సేవలు అందించడానికి e-ఆఫీసును ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ తెలిపారు. సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సెక్రటేరియట్ లోని 8 శాఖలలో, HoD లలో 2 శాఖలలో e-ఆఫీసును ప్రారంభించారు.
  • హైదరాబాద్ లో పెరిగిన ఫోర్ వీలర్లఅమ్మాకాలు . మేనెలతో పోల్చితే రెండు నుంచి మూడింతలు పెరిగిన సేల్స్. సేల్స్ పెరగడంతో రిజిస్ట్రేషన్లు పెరిగాయంటున్న హైదరాబాద్ ఆర్టీఏ అధికారులు . మే నెలలో 326 ఫోర్ వీలర్ల రిజిస్ట్రేషన్లు. జూన్ లో 848 , జూలై లో 1149 రిజిస్ట్రేషన్లు . ఆర్ టి ఎ హైదరాబాద్ జాయింట్ కమిషనర్ పాండు రంగా నాయక్.
  • హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్. హైదరాబాద్ పాతబస్తీ సౌత్ జోన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్ ల మేళా ను సాలార్ జుంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసము. పాతబస్తీ లో సత్ప్రవ్తన కలిగి నేరాలకు దూరంగా ఉన్న 31 మంది రౌడీ షీటర్ పై పోలీస్ రికార్డుల్లో నుంచి రౌడీ షీట్ తొలగించము. వీరంతా కొత్త జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు అవకాశం కలిపించం. గతంలో వీరంతా తప్పులు చేసి, నేరాలు చేసి జైల్ వెళ్లిన వారు. కానీ ఇప్పుడు ఒక సదవకాశం వీరు అందరికీ ఆదర్శంగా ఉండి కుటుంబం తో సంతోషంగా జీవించాలని సాధారణ పౌరులుగా వుండాలని కోరుతున్న.
  • విజయవాడ: కోవిడ్‌ ఆస్పత్రి సిబ్బంది చేతివాటం. రోగుల మొబైల్స్, డబ్బులు మాయం. సెల్‌ చోరీ చేస్తున్న దృశ్యాలు. సీసీ కెమెరాల్లో రికార్డు. ఒక రోగి అదృశ్యంపై అధికారులు సీసీ కెమెరాలు పరిశీలన. ఓ ఉద్యోగి రోగి సెల్‌ఫోన్‌ తస్కరించడం చూసి అధికారులు షాక్. ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితులు. ఉద్యోగి పై ఎవరు అనే కోణంలో దర్యాప్తు. సిబ్బంది ప్రవర్తనపై అధికారులు ఆరా.
  • అమరావతి: 3 రాజధానుల బిల్లు ఆమోదంపై హైకోర్టులో మరో పిల్. హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలు చేసిన రాజధాని రైతులు శ్రీనివాసరావు, సాంబశివరావు. అధికార వికేంద్రీకరణ బిల్లుల ఆమోదం సవాలు చేస్తూ ఒక పిటిషన్. సీఆర్డీఏ రద్దు సవాలు చేస్తూ రెండో పిటిషన్. జేఎన్ రావు కమిటీ, హైపవర్ కమిటీ, బోస్టన్ స్. కన్సల్టెన్సీ నివేదికలు, కమిటీలను సవాలు చేస్తూ మూడో పిటిషన్ దాఖలు. రేపు విచారణకు వచ్చే అవకాశాలు. ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన రాజధాని పరిరక్షణ సమితి.

చిరంజీవి సినీకెరీర్‌లో హిట్లెన్ని..? ఫ్లాపులెన్ని..?

These are the hits and flops in Megastar Chiranjeevi movie career, చిరంజీవి సినీకెరీర్‌లో హిట్లెన్ని..? ఫ్లాపులెన్ని..?

కొణిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి.. అనతికాలంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ కెరీర్‌లో తొలుత కాస్త.. ఇబ్బందులు ఎదుర్కొన్నా.. అనంతరం.. ‘ఖైదీ’ సినిమాతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘మెగాస్టార్ చిరంజీవి’గా ప్రేక్షకుల గుండెల్లో అంతులేని అభిమానాన్ని సంపాదించుకున్నారు. 1980లలో చిరంజీవి ఒక ప్రభంజనం. బాలీవుడ్‌లో బిగ్‌బీ ఎలానో.. టాలీవుడ్‌లో చిరంజీవి అలా. దివంగత మాజీ సీఎం, ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు తరువాత.. ఆ స్థాయిలో అభిమానించతగ్గ గొప్ప నటుడిగా.. తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన నటావిశ్వరూపానికి 2006 జనవరిలో భారత ప్రభుత్వం తరుపున అప్పటి రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలామ్.. చిరంజీవికి ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని, నవంబర్ 2006లో డాక్టరేట్‌ని ఇచ్చి గౌరవించారు.

నిజానికి చిరంజీవి మొదటి సినిమా.. 1978లో చేసిన ‘పునాది రాళ్లు’ చిత్రం. కానీ.. దాని కంటే ముందుగా.. ఆ తరువాత చేసిన ‘ప్రాణం ఖరీదు’ సినిమా విడుదల అయ్యింది. మొదటి సినిమాకి రూ.1,116 రూపాయల పారితోషికంతో.. ప్రారంభమైన చిరూ సినీ ఆరంభం.. కోటి రూపాలయ దాకా వెళ్లింది. సైడ్‌ ఆర్టిస్ట్‌గా, కమేడియన్‌గా, విలన్‌గా, హీరోగా.. పలు రకాల పాత్రలను చిరు పోషించారు. 1991లో రిలీజైన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో.. మంచి మాస్‌ ఇజాన్ని సంపాదించారు చిరు. ఈ రోజుల్లో.. సినిమా ఒక వారం కంటిన్యూగా ఆడితేనే.. సూపర్ హిట్ అంటున్నారు. అప్పట్లో.. చిరంజీవి సినిమాలు ఒక సంవత్సరంలో.. 365 డేస్ కంటిన్యూగా థియేటర్స్‌లలో ఆడేవి.

కాగా.. చిరు గురించి మరో ఆసక్తికరమైన విషయం.. డ్యాన్స్‌. డ్యాన్స్‌లో.. ఆయనకి పోటీ లేరనే చెప్పవచ్చు. మొదటిగా టాలీవుడ్‌లో బ్రేక్ డ్యాన్స్‌ని ప్రేక్షకులకు పరిచయం చేసింది ఆయనే. ఎలాంటి కఠినతరమైన స్టేప్స్ అయినా.. అవలీలగా చేసి చూపిస్తారు. అలాగే.. మాస్, క్లాస్, కామెడీ ఇలా అన్ని రకాల సినిమాలు చేశారు చిరంజీవి. రుద్రవీణ, ఆపద్భాందవుడు, స్వయం కృష్టి లాంటి క్లాస్ హిట్స్‌లలో కూడా ఓ రేంజ్‌లో నటించి మెప్పించారు. అంతేకాకుండా.. శివుడి పాత్రలు.. చిరంజీవికి పెట్టింది పేరు అంటారు. స్వయానా శివుడే.. భూలోకానికి వచ్చారా అన్నట్టుగా.. ఆయన అభినయం ఉండేది. ఇకపోతే.. ఆయన సినీ కెరీర్‌లో ఎన్ని హిట్స్‌.. ఎన్ని ఫ్లాప్స్‌ సినిమాలు ఉన్నాయో తెలుసుకుందామా..!

చిరంజీవి హిట్‌ సినిమాల లిస్ట్:

1982 – శుభలేఖ, 1983 – అభిలాష, 1983 – ఖైదీ, 1984 – ఛాలెంజ్, 1985 – విజేత, 1986 – చంటబ్బాయి, 1987 – దొంగ మొగుడు, 1987 – పసివాడి ప్రాణం, 1987 – స్వయం కృషి, 1988 – రుద్ర వీణ, 1988 – యముడికి మొగుడు, 1989 – అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, 1990 – కొండవీటి దొంగ, 1990 – జగదేవ వీరుడు అతిలోక సుందరి, 1991 – రౌడి అల్లుడు, 1991-గ్యాంగ్ లీడర్, 1992-ఘరానా మొగుడు, 1992-ఆపద్బాంధవుడు, 1993-ముఠామేస్త్రి, 1997-హిట్లర్, 1998-చూడాలని వుంది, 1999-స్నేహం కోసం, 2000-అన్నయ్య, 2001-డాడీ, 2001-మృగరాజు, 2002-ఇంద్ర, 2003-ఠాగూర్, 2017-ఖైది నెంబర్ 150

చిరంజీవి ఫ్లాప్ సినిమాల లిస్ట్:

1979 – పునాది రాళ్లు
1980 – పున్నమి నాగు
2004 – అంజి
2006 – స్టాలిన్
2005 – అందరివాడు
2005 – జై చిరంజీవా
2007 – శంకర్ దాదా జిందాబాద్

Related Tags