కృష్ణమ్మ పరవళ్లు… 10 గేట్లు ఎత్తివేత

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువైంది. ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో ప్రాజెక్టు 12 గేట్లకు గాను పదింటిని ఎత్తి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు. నీరు కిందికి పరవళ్లు దుంకుతున్న దృశ్యం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. డ్యాం నుంచి నీటి తుంపరలు ఘాట్ రోడ్డు పైకి ఎగసిపడుతుండటంతో అక్కడ మరింత ఆహ్లాదం నెలకొంది. దాదాపు 2,43,171 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న […]

కృష్ణమ్మ పరవళ్లు... 10 గేట్లు ఎత్తివేత
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2019 | 6:53 PM

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువైంది. ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో ప్రాజెక్టు 12 గేట్లకు గాను పదింటిని ఎత్తి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు. నీరు కిందికి పరవళ్లు దుంకుతున్న దృశ్యం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. డ్యాం నుంచి నీటి తుంపరలు ఘాట్ రోడ్డు పైకి ఎగసిపడుతుండటంతో అక్కడ మరింత ఆహ్లాదం నెలకొంది. దాదాపు 2,43,171 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. ఒక్కోగేటును 10 మీటర్ల మేర ఎత్తినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 4.04లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు వారు తెలిపారు. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.70 అడుగులు నమోదైంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 202.96 టీఎంసీలకు నీటి నిల్వ పైగా ఉంది.

ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా 31,059 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 800క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,025 క్యూసెక్కులు, పొతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యూలేటరీ ద్వారా 28,000 క్యూసెక్కులు, ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్‌కు 735 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు నాగార్జున సాగర్‌ జలాశయానికి కూడా వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 1.02లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 6,051 క్యూసెక్కులు ఉంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగానూ.. ప్రస్తుతం 520.90 అడుగుల నీటిమట్టం నమోదైంది. జలాశయం పూర్తి సామర్థ్యం 312.05 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 150.92 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో