Telangana: అసలు మీరు మనుషులేనా.. ఇంత దారుణానికి పాల్పడతారా.. యువకుడిపై కుటుంబసభ్యుల దుశ్చర్య

|

Sep 04, 2022 | 7:52 AM

జగిత్యాల జిల్లాలో అమానుష ఘటన జరిగింది. యువకుడి పట్ల సొంత కుటుంబసభ్యులే దారుణానికి పాల్పడిన ఉదంతమిది. మానసిక పరిస్థితి సరిగా లేదనే కారణంతో అమానవీయంగా ప్రవర్తించారు. అతడిని ఎలాగైనా..

Telangana: అసలు మీరు మనుషులేనా.. ఇంత దారుణానికి పాల్పడతారా.. యువకుడిపై కుటుంబసభ్యుల దుశ్చర్య
Harassment
Follow us on

జగిత్యాల జిల్లాలో అమానుష ఘటన జరిగింది. యువకుడి పట్ల సొంత కుటుంబసభ్యులే దారుణానికి పాల్పడిన ఉదంతమిది. మానసిక పరిస్థితి సరిగా లేదనే కారణంతో అమానవీయంగా ప్రవర్తించారు. అతడిని ఎలాగైనా వదులుకోవాలని నిర్ణయించుకున్నాడు. దైవ దర్శనానికి వెళ్లాలని చెప్పి కొండగట్టుకు తీసుకువచ్చారు. అక్కడ అతని కాళ్లకు సంకెళ్లు వేసి, కొండపై వదిలేసి వెళ్లిపోయారు. నిర్మల్ జిల్లా రాజురా గ్రామానికి చెందిన ఓ యువకుడికి మతిస్థిమితం సరిగా లేదు. కొన్నాళ్లుగా భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో అతను జగిత్యాల జిల్లాలోని మల్యాల గ్రామంలో కాళ్లలో సంకెళ్లు వేసుకుని కదలలేని పరిస్థితుల్లో కనిపించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అతడిని చేరదీశారు. అతని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. తనది నిర్మల్ జిల్లా అని, మూడు నెలల క్రితం కుటుంబసభ్యులు తన కాళ్లకు గొలుసులు వేసి కొండగట్టు కొండపై వదిలేసి వెళ్లారని చెప్పాడు. పాకుకుంటూ కొండ దిగి మల్యాలకు వచ్చినట్లు కన్నీటిపర్యంతమయ్యాడు. తనను ఇంటికి పంపించాలని వేడుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానిక యువకులు యువకుడి సంకెళ్లు తొలగించారు. విరాళాల ద్వారా నగదు జమ చేసి నిర్మల్‌ బస్సు ఎక్కించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం…