Lok Sabha Elections 2024: తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందా..? పవన్ పొలిటికల్ ప్లాన్ ఏంటి?

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణం తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి జనసేనాని పవన్ కళ్యాణ్ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిగా ఎన్నికల బరిలో దిగుతున్నాయి. పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. అయితే జనసేన టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలోకి క్యూ కట్టారు. జనసేన నేతలకు టికెట్లు ఇవ్వలేదనే బాధ కంటే కూడా.. పక్క పార్టీల నుంచి పిలిచి మరి టికెట్ ఇవ్వడంపై మండిపడుతున్నారు.

Lok Sabha Elections 2024: తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందా..? పవన్ పొలిటికల్ ప్లాన్ ఏంటి?
Pawan Kalyan
Follow us

|

Updated on: Apr 13, 2024 | 8:03 AM

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. దీనికి కారణం తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి జనసేనాని పవన్ కళ్యాణ్ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిగా ఎన్నికల బరిలో దిగుతున్నాయి. పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. అయితే జనసేన టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలోకి క్యూ కట్టారు. జనసేన నేతలకు టికెట్లు ఇవ్వలేదనే బాధ కంటే కూడా.. పక్క పార్టీల నుంచి పిలిచి మరి టికెట్ ఇవ్వడంపై మండిపడుతున్నారు. ఇప్పటికే పోతిన మహేష్, మనుక్రాంత్ రెడ్డి, పితాని బాలకృష్ణ, పాముల రాజేశ్వరి సహా పలువురు నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. మరికొందరు అదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వరుసగా నేతలు పార్టీని వీడుతుండడంతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అలర్టయ్యారు. మొన్నటి వరకు అసంతృప్తులపై కన్నెత్తి కూడా చూడని పవన్ కల్యాణ్ ఇప్పుడు వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. టికెట్లు దక్కని సీనియర్లలో కొంతమందికి జిల్లా ఇన్‌ఛార్జ్‌లుగా బాధ్యతలు అప్పగిస్తూ.. మరికొంతమందికి పార్టీ ఏర్పాటు చేసిన కమిటీలో అవకాశాలు ఇచ్చి వారిని బుజ్జగిస్తున్నారు.

తిరుపతి టికెట్‌ అరణి శ్రీనివాసులుకు కేటాయించడంతో జనసేనలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కిరణ్ రాయల్ సీటు ఆశించారు. కానీ వైసీపీ నుంచి వచ్చిన అరణి శ్రీనివాసులుకి టికెట్ కేటాయించడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే ప్రచారంలో శ్రీనివాసులకి అటు జనసేన నుంచి, ఇటు టీడీపీ నుంచి సహకారం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో తిరుపతి వెళ్లిన పవన్ కల్యాణ్ కూటమి నేతలతో సమావేశమయ్యారు. టీడీపీ అసమ్మతి నేతలతోనూ పవన్‌ మాట్లాడారు. తిరుపతి జనసేన అభ్యర్థిపై నిర్ణయం చంద్రబాబుతో కలిసి తీసుకున్నామని వారికి వివరించారు. జనసేన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కోసం సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు పవన్‌ కల్యాణ్‌. బొంగునూరి మహేందర్‌రెడ్డి సమన్వయకర్తగా, శంకర్‌గౌడ్, రాజలింగం, పొన్నూరి శిరీష, ప్రేమ్‌కుమార్‌, ములుకుంట్ల సాగర్‌ సభ్యులుగా ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా 7 స్థానాల్లో పోటీ చేసిన జనసేన ఆశించినంతమేర సక్సెస్ కాలేదు. మరి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణలో ఖాతా ఓపెన్ చేస్తుందా అనేది వేచి చూడాలి. అయితే ఇప్పటి వరకు 17 లోక్ సభ స్థానాలకుగాను ఒక్క నియోజకవర్గానికి కూడా అభ్యర్థులను ప్రకటించలేదు జనసేన. అయితే నామినేషన్ ప్రక్రియకు కేవలం ఐదు రోజుల ముందు ఈ సమావేశం ఏర్పాటు చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రత్యక్షంగా పోటీ చేస్తారా లేక గతంలో లాగా ఇతర పార్టీలకు మద్దతు ఇస్తారా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ