Telangana: తనకంటే చిన్నవాడితో ఆ యవ్వారం.. అర్థరాత్రి భర్త పడుకున్నాక.. ఎంత పని చేశావ్ మౌనిక..

అక్రమ సంబంధాలు ప్రాణాలు తీస్తూ.. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి.. తాజాగా.. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్య.. భర్తను హత్య చేసింది.. ఈ ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలో కలకలం రేపింది.. మద్యం మత్తులో ఉన్న భర్తను.. చంపి ఏం తెలియనట్లు భార్య డ్రామా చేసింది. చివరకు పోలీసులు అసలు విషయాన్ని నిగ్గు తేల్చడంతోపాటు.. సంచలన విషయాలను వెల్లడించారు.

Telangana: తనకంటే చిన్నవాడితో ఆ యవ్వారం.. అర్థరాత్రి భర్త పడుకున్నాక.. ఎంత పని చేశావ్ మౌనిక..
Wife Lover Kill Husband in Medak

Edited By:

Updated on: Jan 03, 2026 | 2:57 PM

అక్రమ సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి.. తాజాగా.. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.. ఈ ఘటన తెలంగాణ మెదక్‌ జిల్లా శివంపేట మండలం తిమ్మాపూర్‌లో జరిగింది. మద్యం మత్తులో ఉన్న భర్త స్వామి (35) ని చంపి.. చెరువులో పడి చనిపోయినట్టుగా నమ్మించేందుకు ప్రయత్నం చేసి.. అడ్డంగా దొరికింది.. విచారణలో భార్య మౌనిక అక్రమ సంబంధం బాగోతం బయటపడంతోపాటు.. స్కెచ్ వేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. డిసెంబర్ 23న నేరెళ్ల కుంటలో పడి బొల్లెబోయిన స్వామి మృతి చెందాడు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పలు కోణాల్లో విచారించి.. అతన్ని చంపింది.. భార్య మౌనిక, ఆమె ప్రియుడు సంపత్ గా తేల్చారు.

వివరాల ప్రకారం.. 12 ఏళ్ల క్రితం స్వామి, మౌనికలకు పెళ్లి జరగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే.. మౌనిక (28) తనకంటే.. తక్కువ వయస్సున్న తిమ్మాపూర్‌ సంపత్ (23) తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తిమ్మాపూర్‌ సంపత్‌తో మౌనికకు అక్రమ సంబంధం భర్త స్వామికి తెలిసింది. దీంతో స్వామి భార్యతో గొడవపడ్డాడు.. దీనిపై పంచాయితీ పెడతానన్న భర్త స్వామి మౌనికకు చెప్పాడు..

ఈ క్రమంలోనే.. డిసెంబర్‌ 22న తాగి వచ్చి గొడవ చేశాడు.. అతడు నిద్రపోయిన తర్వాత ప్రియుడు సంపత్‌ను ఇంటికి పిలిచిన మౌనిక.. స్వామిపై దాడి చేసింది.. ఇద్దరూ కలిసి గొంతుకు చున్నీని బిగించి హత్య చేశారు.. అనంతరం మౌనిక సంపత్.. బైక్‌పై మృతదేహాన్ని తీసుకెళ్లి.. నేరెళ్లకుంటలో పడేశారు.. ఆ తర్వాత.. మద్యం మత్తులో భర్త స్వామి చెరువులో పడి చనిపోయినట్టు మౌనిక నమ్మించింది..

ఆ తర్వాత మౌనిక, సంపత్‌ విషయం తెలిసి.. పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అన్ని విషయాలు బయటపడ్డాయి. తామే చంపినట్లు మౌనిక, సంపత్ ఒప్పుకున్నారు.. దీంతో మౌనిక, ఆమె ప్రియుడు సంపత్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..