ఖైర‌తాబాద్ బాహుబలి గణపతికి..రథసారథి ఎవరో తెలుసా? అతడి జీతం ఎంతో తెలిస్తే..

హైదరాబాదులో గణేష్ నిమజ్జనం అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు. భారీ గణపతి.. లక్షలాది భక్తుల సందడి.. కిక్కిరిసిన రోడ్లు.. అడుగడుగునా పోలీసులు.. ఇంచు మించు కదలికలేని ట్రాఫిక్‌.. ఇలాంటి పరిస్థితుల్లో బాహుబలి గణపతిని క్షేమంగా నిమజ్జనానికి చేర్చడం అంటే మాటలు కాదు. కానీ.. ఆ భారీ విగ్రహాన్ని మోసుకెళ్లే ట్రక్కుకు స్టీరింగ్‌ పట్టేది మాత్రం ఒక్కరే. అంతటి విశిష్టత కలిగిన ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్రకు రథసారథ్యం వహించేది ఎవరో తెలుసా..?

ఖైర‌తాబాద్ బాహుబలి గణపతికి..రథసారథి ఎవరో తెలుసా? అతడి జీతం ఎంతో తెలిస్తే..
Khairatabad Ganesh Immersion

Edited By:

Updated on: Sep 25, 2026 | 10:07 AM

ఖైరతాబాద్‌ అంటే భారీ గణపతి.. భారీ గణపతి అంటే నిమజ్జన శోభాయాత్ర. ఈ శోభాయాత్రలో వేల టన్నుల బరువు ఉన్న విగ్రహాన్ని మోసే భారీ వాహనాన్ని నడపడం అత్యంత కీలకం. లక్షలాది మంది భక్తులు రోడ్డుకిరువైపులా ఉంటారు.. వారి మధ్య.. అత్యంత అప్రమత్తంగా.. అతి తక్కువ వేగంతో ట్రక్కును ముందుకు తీసుకెళ్లాలి. చిన్న పొరపాటుకు కూడా తావు లేకుండా భారీ వాహనాన్ని నడపడం ఒక ఎత్తయితే.. బాహుబలి గణపతిని నిమజ్జనానికి చేర్చడం మరో ఎత్తు. అందుకే డ్రైవర్‌కు అనుభవం, ఏకాగ్రత అత్యంత కీలకం. అందుకే ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్రలో విగ్రహం ఎంత ప్రత్యేకమో.. ఆ విగ్రహాన్ని సురక్షితంగా గమ్యానికి చేర్చే రథసారథి కూడా అంతే ప్రత్యేకం.

సూర్యాపేట జిల్లా వాసి…

ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఖైరతాబాద్‌ గణేశుడికి రథసారథిగా వ్యవహరించడం మామూలు వ్యవహారం కాదు. ఇలాంటి క్లిష్టమైన బాధ్యతను నిర్వర్తించే అవకాశం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం ముక్కుడుదేవులపల్లికి చెందిన మందడి వెంకటరెడ్డికి దక్కింది. వెంకటరెడ్డికి మాత్రం ఇది కొత్త కాదు.. ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్రలో ఇప్పటికే మూడుసార్లు ట్రక్కును నడిపిన అనుభవం ఆయన సొంతం.

26 టైర్ల టస్కర్‌.. గంటకు ఎంత దూరం వెళ్తుంది..?

ఖైరతాబాద్‌ మహా గణపతిని నిమజ్జనానికి తరలించడం అంటే అదో మహాప్రస్థానం.. ఇందుకోసం ప్రత్యేకంగా భారీ టస్కర్‌ను ఉపయోగిస్తారు. 26 టైర్లతో ఉండే ఈ వెహికిల్‌ స్పీడ్‌ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. సుమారు 4 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 6 గంటల్లో పూర్తి చేస్తుంది. ఈ లెక్కన గంటకు సగటున కేవలం 0.67 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే సాధారణంగా మనం నడిచే వేగం కంటే కూడా తక్కువ వేగం అన్నమాట.

ఇవి కూడా చదవండి

 ట్రాన్స్ పోర్ట్ లో 26 ఏళ్ల అనుభవం కలిగిన డ్రైవర్..

విజయవాడకు చెందిన ఎస్టీసీ ట్రాన్స్‌పోర్ట్‌లో 26 ఏళ్లుగా మందడి వెంకట్ రెడ్డి డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. భారీ వాహనాలను నడపడంలో ఉన్న అనుభవమే.. ఆయనకు ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్రలో ప్రత్యేక బాధ్యతను తెచ్చిపెట్టింది. 2017లో తొలిసారి ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్రలో భారీ ట్రక్కును నడిపారు. ఆ తర్వాత 2020లోనూ.. 2025లోనూ అదే బాధ్యత నిర్వర్తించారు. ఇప్పుడు మరోసారి అవకాశం దక్కింది.

వినాయకుడి కృప…

బాహుబలి గణపతికి రథసారథిగా నాలుగుసార్లు అవకాశం.. డ్రైవర్ వెంకటరెడ్డి అదృష్టంగా భావిస్తున్నారు. వినాయకుడి కృపతోనే నాలుగు సార్లు ఈ అవకాశం వచ్చింది. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ఈసారి కూడా అదే నమ్మకంతో బాధ్యత నిర్వర్తిస్తానని” వెంకటరెడ్డి చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us