AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలకూర జ్యూస్ ట్రై చేసి చూడండి..ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!

పాలకూర మన దేశంలో అత్యంత విస్తృతంగా లభించే, రోజూ వినియోగించే ముఖ్యమైన ఆకుకూరల్లో ఒకటి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు నిండి ఉన్న ఈ ఆకుకూరను పోషకాల నిధి అని పిలుస్తారు. దీనితో రకరకాల వంటకాలు చేసుకోవడమే కాకుండా, జ్యూస్‌గా తీసుకుంటే శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు అందుతాయి. ముఖ్యంగా శీతాకాలంలో వారానికి కనీసం రెండుసార్లు పాలకూర జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పాలకూర జ్యూస్ ట్రై చేసి చూడండి..ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!
Spinach Juice Benefits
Jyothi Gadda
|

Updated on: Sep 25, 2026 | 7:30 AM

Share

పోషకాల నిధి అయిన పాలకూర ఏ సీజన్‌లోనైనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాలకూర జ్యూస్ తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో విటమిన్ ఎ, సి, కె, ఇ లతో పాటు కాల్షియం, ఐరన్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వారానికి రెండుసార్లు ఈ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి..? కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాటో వివరంగా చూద్దాం..

ఇంట్లోనే పాలకూర జ్యూస్ తయారు చేసుకునే విధానం:

పాలకూర జ్యూస్ చేయడం చాలా సులభం. ముందుగా తాజా పాలకూర ఆకులను తీసుకుని నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత దానిని మిక్సర్ జార్‌లో వేసి, కొద్దిగా నీరు, నిమ్మరసం చేర్చి బాగా బ్లెండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి వడకట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. రుచి కోసం కొద్దిగా నల్ల ఉప్పును కూడా కలుపుకోవచ్చు.

పాలకూర జ్యూస్ తాగడం వల్ల కలిగే 8 ముఖ్యమైన ప్రయోజనాలు:

బలమైన ఎముకలు: చలికాలంలో ఎముకల సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. పాలకూరలోని కాల్షియం, విటమిన్ కె ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

రోగనిరోధక శక్తి పెరుగుదల: విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేసి, టాక్సిన్లను బయటకు పంపి ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.

మెరిసే చర్మం, దృఢమైన జుట్టు: ఇందులో ఉండే విటమిన్ ఎ, సి, ఇ పోషకాలు చర్మాన్ని కాంతివంతంగా మార్చడంతో పాటు చర్మ, జుట్టు సమస్యలను నివారిస్తాయి.

కంటి ఆరోగ్యం: పాలకూరలో లుటీన్, విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చూపును మెరుగుపరచడమే కాకుండా, కంటిశుక్లం వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.

షుగర్ లెవల్స్ నియంత్రణ: డయాబెటిస్ ఉన్నవారికి పాలకూర రసం ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

జీర్ణక్రియ మెరుగుదల: పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పాలకూర జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థను ఉత్తేజపరిచి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

గుండె ఆరోగ్యం: ఇది రక్తపోటు (BP), కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

క్యాన్సర్ నివారణ: పాలకూరలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలకు కలిగే నష్టాన్ని నివారించి, క్యాన్సర్ బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తాయి.

కాబట్టి, ఈ శీతాకాలంలో పాలకూర జ్యూస్‌ను మీ దినచర్యలో భాగం చేసుకుని పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందండి!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us