Rains Alert: వాతావరణ శాఖ అలర్ట్‌.. ఏపీ, తెలంగాణలో నేడు భారీ వర్షాలు.. అల్పపీడనంగా మారే అవకాశం..!

|

Oct 10, 2021 | 9:33 AM

Weather Forecast Today: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో జోరుగా వర్షాలు..

Rains Alert: వాతావరణ శాఖ అలర్ట్‌.. ఏపీ, తెలంగాణలో నేడు భారీ వర్షాలు.. అల్పపీడనంగా మారే అవకాశం..!
Follow us on

Weather Forecast Today: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆదివారం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణకేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రెండు రోజుల పాటు వానలు పడతాయని తెలిపింది.

ముఖ్యంగా ఆదివారం ఆదిలాబాద్, కొమరం భీమ్ అసిఫాబాద్, ములుగు, రాజన్న, సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు చోట్ల కుండపోత వర్షాలు పడే అవకాశముంది.

ఇక సోమవారం కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. చాలా ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. మరోవైపు మనదేశంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ కొనసాగుతోంది. రెండు రోజుల్లో ఉత్తర భారతం నుంచి రుతుపవనాలు వెళ్లిపోనున్నాయి. నైరుతి రుతుపవనాల తిరోగమనం నేపథ్యంలో పలు రాష్ట్రాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. తుఫాన్ల కారణంగా కురిసిన భారీ వర్షాలతో నదులు, చెరువులు, ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయాయి.

ఏపీలోనూ..

ఏపీలో రాబోయే రెండు, మూడు రోజుల్లో సాధరణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆది, సోమవారాల్లో ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాంధ్ర:

శనివారం దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురియగా, ఆది, సోమవారాల్లో దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది .

ఇక ఆదివారం రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. అలాగే అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. అలాగే, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

ఇవీ కూడా చదవండి:

Petrol Diesel Price Today: భగ్గుమంటున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. మళ్లీ పరుగులు.. తాజా రేట్ల వివరాలు..!

PM Kisan: రైతులకు అలర్ట్‌.. వీరికి పీఎం కిసాన్‌ స్కీమ్‌ కింద డబ్బులు రావు.. ఎందుకంటే..!