Corona: వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం.. 20 మంది డాక్టర్లకు పాజిటివ్.. జిల్లాలో భారీగా కేసులు

|

Apr 17, 2021 | 7:43 AM

Warangal MGM Hospital: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. నిత్యం వేలాది కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణలో కూడా సెకండ్ వేవ్ భయభ్రాంతులకు

Corona: వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం.. 20 మంది డాక్టర్లకు పాజిటివ్.. జిల్లాలో భారీగా కేసులు
Mgm Hospital
Follow us on

Warangal MGM Hospital: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. నిత్యం వేలాది కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణలో కూడా సెకండ్ వేవ్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. జీహెచ్ఎంసీతోపాటు.. గ్రేటర్ కార్పోరేషన్లల్లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు కూడా కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 20 మంది హౌస్ సర్జన్ డాక్టర్‎లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అంతకుముందు కూడా పలువురు డాక్టర్లు కరోనా బారిన పడి కోలుకున్నారు. అయితే తాజాగా కరోనా నిర్థారణ అయిన వారిలో వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా ఉన్నట్లు పేర్కొంటున్నారు.

ఇదిలాఉంటే.. గురువారం రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేయికి పైగా కేసులు నమోదయ్యాయి. రోజుకు ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడుతుండటంతో.. బాధితులంతా ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఎక్కువ కేసులు మునిపాలిటీ ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఎంజీఎం ఆసుపత్రిలో 20 మంది హౌస్ సర్జన్ వైద్యులకు కరోనా సోకడంతో.. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆందోళన మరింత ఎక్కువైంది.

ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గురువారం 3,840 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం… ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 30,494కి పెరిగింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 505 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా బెడ్ల కొరత ప్రారంభమైంది.

Also Read: