Telangana: రేపు(శుక్రవారం) ఆ జిల్లాల్లో సెలవు ప్రకటించిన కలెక్టర్లు..

|

Feb 17, 2022 | 6:24 PM

తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర సందర్భంగా పలు జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. ఆ వివరాలు మీ కోసం.

Telangana: రేపు(శుక్రవారం) ఆ జిల్లాల్లో సెలవు ప్రకటించిన కలెక్టర్లు..
Telangana Government
Follow us on

Medaram Jatara 2022:  తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర( sammakka sarakka jatara) సందర్భంగా పలు జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. రేపు(శుక్రవారం) వరంగల్, పెద్దపల్లి జిల్లాల్లో సెలవు ఉంటుందని కలెక్టర్లు తెలిపారు. అన్ని రకాల విద్యాసంస్థలు, స్థానిక సంస్థలకు సెలవు వర్తిస్తుందని వెల్లడించారు.  బ్యాంకులు తెరిచే ఉంటాయని చెప్పారు. శుక్రవారం(ఫిబ్రవరి 18) సెలవు ఇచ్చినందున మార్చి 12న (రెండో శనివారం) వర్కింగ్ డేగా ఉంటుందని స్పష్టం చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర కన్నులపండుగగా కొనసాగుతోంది.  మేడారంలో కీలక ఘట్టంమైన సమ్మక్క ఆగమనం జరిగింది. సమ్మక్క తల్లి రావడంతో మేడారం ఇసుక వేస్తే రాలనంత జనాలతో కిక్కిరిసిపోయింది. చిలకల గుట్ట నుంచి కుంకుమ భరిణె రూపములో ఉన్న అమ్మవారిని గిరిజన సంప్రదాయ పూజల అనంతరం తీసుకువచ్చారు. మాఘశుద్ద పౌర్ణమి వెన్నెల్లో సమ్మక్కను ఆదివాసీ గిరిజన ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి మేళ తాళాలతో గద్దెలపైకి తరలించారు.  ఇప్పటి వరకు జాతరకు 70 లక్షల మంది భక్తులు వచ్చారని, మూడు రోజుల్లో మరో 50 నుంచీ 60  లక్షల మంది భక్తులు వచ్చే చాన్స్ ఉందని అధికారుల అంచనా.  సమ్మక్క తల్లి ఆగమనంతో వనదేవతల దర్శనం కోసం.. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేశారు.

Also Read: Tirumala: ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరికీ ఒకే రకమైన భోజనం.. టీటీడీ సంచలన నిర్ణయం

కారంపొడి, పచ్చి మిర్చి రెండింటిలో ఏది బెటర్.. ఈ విషయాలు మీరు అస్సలు నమ్మలేరు