
Warangal: కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన పాత నోట్లు బారీఎత్తున పట్టు బడ్డాయి. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 1కోటి 38 లక్షల రూపాయల పాత కరెన్సీ లభ్యమైంది. ఆ కరెన్సీ మార్పిడికి ప్లాన్ చేస్తున్న ముఠా కటకటాల పాలయ్యారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కాజీపేట పీఎస్ పరిధిలో పోలీసుల చేతికి పాత రూ.500, రూ.1,000 నోట్లు బారీ ఎత్తున పట్టుబడ్డాయి. రద్దయిన ఈ కరెన్సీ 1కోటి 38 లక్షల రద్దు చేయబడ్డ కరెన్సీ పట్టుబడింది. ఇంత పెద్దమొత్తంలో ఎక్కడి నుంచి వచ్చాయి.? ఎక్కడికి వెళ్తున్నాయి.? వీటిని ఎలా మార్పిడి చేస్తారు..! అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది
దేశంలో పెద్దనోట్ల రద్దు జరిగి దాదాపు దశాబ్దం కావస్తుంది. 2016 నవంబర్ 08వ తేదిన పెద్ద నోట్ల రద్దు జరిగింది. అప్పట్లో చలామణిలో ఉన్న పాత రూ.500, రూ.1,000 నోట్లు రద్దయ్యాయి. ఈ నోట్ల డిపాజిట్ కు RBI కొంత కాలపరిమితి విధించింది. రద్దయిన నోట్లు చెలామణి నేరం.. ఆ నోట్లు చెల్లని కరెన్సీగా గుర్తిస్తారు. తాజాగా హనుమకొండ జిల్లా కాజీపేటలో పోలీసులు రద్దయిన నోట్లను పట్టుకోవడంతో చర్చ మొదలైంది. ఒకప్పుడు చేతిలో ఉంటే విలువైన కరెన్సీ.. ఇప్పుడు చట్టబద్ధ చెల్లుబాటు లేని నోట్లు. మరి ఇంతకాలం తర్వాత ఇవి ఎవరి వద్దకు చేరాయి.? వీటిని ఎందుకు, ఎక్కడికి తరలిస్తున్నారు.? అనే ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం అప్పట్లో చలామణిలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్ల చట్టబద్ధ చెల్లుబాటును రద్దు చేసింది. నిర్దేశించిన గడువులో వాటిని బ్యాంకుల్లో జమ చేసుకునే అవకాశం కల్పించారు. ఆ గడువు ముగిసిన తర్వాత సాధారణ లావాదేవీల్లో ఆ నోట్లను ఉపయోగించేందుకు వీలు లేదు. రద్దయిన నోట్లు పెద్ద మొత్తంలో ఎవరి వద్దైనా కనిపిస్తే.. వాటి వెనుక ఉన్న వ్యవహారంపై పోలీసులు ఆరా తీయడం సహజం. నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి.? ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు? వాటి వెనుక ఏదైనా అక్రమ లావాదేవీ ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు
అయితే కర్ణాటక నుండి ఈ కరెన్సీ తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారులో వీటిని తరలిస్తున్నారు. పట్టుబడిన వారిలో కర్ణాటక కు చెందిన అబ్బాస్ అలీ, మంచిర్యాల కు చెందిన మల్లేష్, కరీంనగర్ జిల్లా జమ్మికుంట కు చెందిన కృష్ణమోహన్, సిద్దిపేట కు చెందిన సంపత్, హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన పల్లపురాజు, వరంగల్ జిల్లా నెక్కొండ మండలానికి చెందిన గణేష్, కరీంనగర్ కు చెందిన శ్యామ్ సుందర్ ఉన్నారు. చెన్నైకి చెందిన రియాజ్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వీరి నుండి కారు, రద్దు చేయబడ్డ కరెన్సీ స్వాధీనం చేసుకున్న పోలీసులు కారు సీజ్ చేశారు. 6 వేల రూపాయలు నగదు, 10 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
ఇది కూడా చదవండి: Indian Railways: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరా పండగ కోసం ప్రత్యేక రైళ్లు..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి