Vikarabad TRS Leaders Fight: వికారాబాద్ టీఆర్‌ఎస్‌లో బయటపడ్డ విభేదాలు మరో మలుపు తిరిగాయి. వికారాబాద్ జెడ్పీ ఛైర్‌పర్సన్ పట్నం సునీతా మహేందర్‌రెడ్డి హాట్ కామెంట్స్‌పై MLA మెతుకు ఆనంద్‌పై కూల్‌గా రియాక్టయ్యారు. మర్పల్లిలో సునీతామహేందర్‌రెడ్డిపై జరిగిన దాడి దురదృష్టకరమంటూ వ్యాఖ్యానించారు. అయినా, ఇది తమ పార్టీ అంతర్గత వ్యవహారమని, తానే స్వయంగా సునీతక్కతో మాట్లాడతానంటూ MLA ఆనంద్ పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ఆనంద్ మాటలు ఇలాగుంటే, వికారాబాద్ జెడ్పీ ఛైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి కారుపై దాడి చేయడం జిల్లాలో దుమారం రేపింది. మర్పల్లిలో మహిళా భవనం శంకుస్థాపనకు వచ్చిన జెడ్పీ ఛైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డిని అడ్డుకున్న ఎమ్మెల్యే వర్గీయులు, ఆమె కారుపై రాళ్లతో దాడి చేశారు. మర్పల్లి గడ్డ-ఆనందన్న అడ్డా అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ ఘటన తర్వాత ఎమ్మెల్యే ఆనంద్‌పై హాట్ కామెంట్స్ చేశారు సునీతామహేందర్‌రెడ్డి. ఎమ్మెల్యే ఆనంద్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఇన్నాళ్లూ ఎందుకని ఊరుకున్నానని, ఇక అన్నింటినీ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని సునీతామహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు, ఆనంద్‌ను జిల్లా పార్టీ పదవి నుంచి తప్పిస్తారంటూ సంచలన కామెంట్స్ చేశారు. అయితే, సునీతామహేందర్‌రెడ్డి కామెంట్స్‌కు భిన్నంగా రియాక్టయ్యారు MLA ఆనంద్. మరి, ఈ వివాదం ముందుముందు ఎలాంటి మలుపులు తిరుగుందోనని కార్యకర్తలు, నాయకులు తలపట్టుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..