Covid-19 Vaccination: నేడు తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ నిలిపివేత.. నిల్వలు లేకపోవడంతోనే..!

|

Apr 18, 2021 | 6:18 AM

Telangana Coronavirus Vaccination: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ కొరత కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆదివారం వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. అయితే అధికారికంగా

Covid-19 Vaccination: నేడు తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ నిలిపివేత.. నిల్వలు లేకపోవడంతోనే..!
Covid-19 vaccination
Follow us on

Telangana Coronavirus Vaccination: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ కొరత కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆదివారం వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. అయితే అధికారికంగా ప్రకటించకుండా ఆదివారం సెలవు కావున వ్యాక్సినేషన్‌ ప్రక్రియను నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు ఓ ప్రకటనను శనివారం జారీ చేశారు. రాష్ట్రంలో సోమవారం నుంచి వ్యాక్సిన్‌ వేస్తామని అన్నారు. అయితే ఆదివారం కేంద్ర ప్రభుత్వం నుంచి 2.7 లక్షల టీకాలు వస్తేనే మరుసటి రోజు టీకా వేసే కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా టీకా నిల్వలు తగ్గిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఎక్కడైనా టీకాలు ఉంటే నిర్ధేశించిన వయసుల ప్రకారం లబ్ధిదారులు టీకా వేయించుకోవచ్చని తెలిపింది. అయితే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ టీకాల కార్యక్రమం ఆదివారం నిలిచిపోయే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

మరో వైపు వ్యాక్సిన్ల కొరత వల్ల రాష్ట్రంలో కరోనా మొదటి డోస్‌కు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఇక నుంచి కొత్తవారికి టీకా వేయకూడదని వైద్య, ఆరోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ల కొరత కారణంగా ప్రస్తుతం ఉన్న నిల్వను సెకండ్‌ డోస్‌ వారికి మాత్రమే ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం అవసరమైనంత వరకు స్టాక్‌ పంపించాక మళ్లీ మొదటి డోస్‌ టీకా ప్రారంభిస్తామని, అప్పటి వరకు ప్రజలు సహకరించాలని అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవంగా ప్రభుత్వం వద్ద లక్షన్నర వరకు మాత్రమే టీకా డోస్‌లు ఉన్నాయి. మరో 2.7 లక్షల డోస్‌లు ఆదివారం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలున్నాయి. రెండో డోస్ లబ్దిదారులకు టీకాను తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్నవి వారికే సరిపోవడం కష్టంగా ఉంది. వారికి సకాలంలో టీకా వేయకపోతే మొదటి డోస్‌ వేసి కూడా ప్రయోజనం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్పటివరకు 29.44 లక్షల మందికి వ్యాక్సిన్..
తెలంగాణలో ఇప్పటివరకు 31.38 లక్షల కరోనా టీకా డోసులు రాగా, శనివారం సాయంత్రానికి రాష్ట్రంలో 29.44 లక్షల టీకాలు వేశారు. అందులో 25.78 లక్షల మందికి మొదటి డోస్‌ వేయగా, 3.66 లక్షలు రెండో డోస్‌ వేశారు. రాష్ట్రంలో మొత్తం 1,147 ప్రభుత్వ, 225 ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కాగా 1.22 శాతం డోసులు వృథా అయినట్టు అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది.

Also Read:

Covid-19 Hospital: కరోనా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం… నలుగురు కరోనా రోగులు సజీవదహనం

నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. మెట్రో ట్రేడింగ్‌ బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో భారీగా మంటలు