నేటితో ముగియనున్న టీ. బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. వాస్తవానికి మార్చి 20 వరకు జరగాల్సి ఉంది. కానీ...

నేటితో ముగియనున్న టీ. బడ్జెట్ సమావేశాలు

Updated on: Mar 16, 2020 | 8:31 AM

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. వాస్తవానికి మార్చి 20 వరకు జరగాల్సి ఉంది. కానీ కరోనాపై ప్రభుత్వ కఠిన నిర్ణయాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల ముందుగానే ముగుస్తున్నాయి. శాసనసభ, మండలి రెండూ ఇవాళ ఉదయం 11 గంటలకు వేర్వేరుగా సమావేశమవుతాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నేడు ఉభయసభల్లో తీర్మానం ఆమోదించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్నది. అసెంబ్లీ సమావేశాల కుదింపునకు సంబంధించి ఆదివారం సాయంత్రం స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి చాంబర్‌లో శాసనసభ ఫ్లోర్‌ లీడర్ల సమావేశం జరిగింది. మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, హరీశ్‌రావు, ఎంఐఎం, కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. కోవిడ్‌పై ప్రభుత్వ నిర్ణయాల నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కుదించాలని నిర్ణయం తీసుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us