Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటెనర్‌ను ఢీకొట్టిన బస్సు.. ఐదుగురు మృతి

Road Accident: ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కోదాడ మండలం ద్వారకుంట దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రావెల్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తోంది. అయితే ప్రమాదం జరగగానే ప్రయాణికులు బస్సుల్లో..

Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటెనర్‌ను ఢీకొట్టిన బస్సు.. ఐదుగురు మృతి
Road Accident

Updated on: Aug 26, 2026 | 6:58 AM

Road Accident: తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రావెల్‌ బస్సు కంటెనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 20 మందికిపైగా గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కోదాడ మండలం ద్వారకుంట దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రావెల్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తోంది. అయితే ప్రమాదం జరగగానే ప్రయాణికులు బస్సుల్లో ఇరుక్కుని ఆర్తనాదాలు చేశారు. దీంతో క్షతగాత్రులను పోలీసులు రెస్క్యూ చేసి బయటకు తీశారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్‌-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us