Revanth Reddy Interview Live: కేసీఆర్‌ది నాది జాతి వైరం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

|

May 04, 2022 | 7:49 PM

Revanth Reddy Exclusive Interview Live Updates: తెలంగాణ కాంగ్రెస్‌ను రేసు గుర్రంలా పరిగెత్తించడమే లక్ష్యం అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు.

Revanth Reddy Interview Live: కేసీఆర్‌ది నాది జాతి వైరం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Revanth Reddy

తెలంగాణ కాంగ్రెస్‌ను రేసు గుర్రంలా పరిగెత్తించడమే లక్ష్యం అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. అధికారంలోకి వచ్చాకా సీఎం ఎవరనేది పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. నేను పీసీసీ అధ్యక్షుడిని కాకముందు కూడా కాంగ్రెస్‌లో గ్రూపులు ఉన్నాయి. కాంగ్రెస్ కు నేతల మధ్య అభిప్రాయభేదాలు, గ్రూపులు కొత్త కాదన్నారు. అన్నింటిని అధిగమించి అధికారంలోకి వస్తుందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనకు తెరపడే సమయం అసన్నమైంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. ఉస్మానియాలో రాహుల్ పర్యటిస్తున్నారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తాం.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 04 May 2022 07:42 PM (IST)

    రెండు, మూడు స్థానాల కోసం బీజేపీ, టీఆర్ఎస్..

    తెలంగాణ తెచ్చాను అని చెప్పుకున్న టీఆర్ఎస్‌కు ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలుస్తుంది. రెండు, మూడు స్థానాల కోసం బీజేపీ, టీఆర్ఎస్ పోటీపడాలి.

  • 04 May 2022 07:41 PM (IST)

    రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకే..

    ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. తాము ఏర్పాటు చేసిన తెలంగాణలో ప్రజలు, రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకే రాహుల్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన సమయం వచ్చింది.

  • 04 May 2022 07:40 PM (IST)

    అందుకే రాహుల్ ఉస్మానియాలో పర్యటించబోతున్నారు..

    వరంగల్‌లో కాంగ్రెస్ నిర్వహించబోయే సభ, ఇప్పటివరకు టీఆర్ఎస్ నిర్వహించిన అన్ని సభలకంటే గొప్పగా ఉంటుందని చెప్పారు. యూనివర్సిటీ శిథిలావస్థలో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి సమస్యలు తెలుసుకుని, పార్లమెంటులో ప్రస్తావించాలని విద్యార్థులు కోరినందుకే రాహుల్ ఉస్మానియాలో పర్యటించబోతున్నారు.

  • 04 May 2022 07:39 PM (IST)

    రాహుల్‌పై టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై..

    మరోవైపు రాహుల్ గాంధీ నేపాల్‌లో పబ్బులో కనిపించడంపై బీజేపీ, టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై కూడా రేవంత్ స్పందించారు. రాహుల్ వెళ్లింది ఒక వివాహ కార్యక్రమానికి అని, అక్కడ ఆయన చైనా రాయబారితో కలిసి కనిపించారన్నారు. అందులో తప్పేమీ లేదని అభిప్రాయపడ్డారు.

  • 04 May 2022 07:36 PM (IST)

    యువతకు సంబంధించి పార్టీ విధానాల్ని స్పష్టం చేయబోతున్నాం

    త్వరలో విద్యార్థులు, యువతకు సంబంధించి పార్టీ విధానాల్ని స్పష్టం చేయబోతున్నాం. ఆ తర్వాత మహిళలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలకు సంబందించిన విధానాల్ని ప్రకటిస్తాం.

  • 04 May 2022 07:34 PM (IST)

    కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు కొత్తకాదు..

    టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి: సమస్యలను పరిష్కరించుకుంటాం.. కాంగ్రెస్ నేతల మధ్య అభిప్రాయభేదాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు కొత్తకాదు.

  • 04 May 2022 07:31 PM (IST)

    నేను రేసు గుర్రంలాంటివాడిని ..

    టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి:  ప్రజలు ఒక్కసారి డిసైడ్ అయితే ఎవరైనా ఆ ప్రభంజనంలో కొట్టుకుపోవాల్సిందే. నాది గుర్రంలాంటిపోకడ. పడుకున్నప్పుడు పడుకుని ఉంటా.. లేచానంటే పరిగెత్తడంలో ఫోకస్ పెడుతా. రాజకీయాల్లో ఏ అవకాశం ఇచ్చినా బాధ్యతగా నిర్వహిస్తాను.

  • 04 May 2022 07:25 PM (IST)

    కేసీఆర్‌ది నాది జాతి వైరం -రేవంత్ రెడ్డి

    టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి: కాకతీయ సామ్రాజ్య పతనమే రెడ్లు, వెలమల మధ్య అధికారం కోసం జరిగింది. అలాగే ఇప్పడు కేసీఆర్‌ది నాది జాతి వైరం కావొచ్చు.

  • 04 May 2022 07:11 PM (IST)

    కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది..

    టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి: తెలంగాణ తెచ్చాను అని చెప్పుకున్న టీఆర్ఎస్‌కు ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలుస్తుంది. రెండు, మూడు స్థానాల కోసం బీజేపీ, టీఆర్ఎస్ పోటీపడాలి.

  • 04 May 2022 07:09 PM (IST)

    వరంగల్‌లో రాహుల్ గాంధీతో రైతు సంఘర్షణ సభ అందుకే..

    టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి: కాంగ్రెస్ పార్టీ బలం చూపించేందు కోసం ఈ వరంగల్ సభను ఏర్పాటు చేయలేదన్నారు. తెలంగాణ సమాజంలో 70 శాతం ఉన్న రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి నమ్మకం నింపేందుకు ఈ సభను ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఒక్కటే సభ మాత్రమే కాదు. వరంగల్‌లో రాహుల్ గాంధీతో రైతు సంఘర్షణ సభను ఏర్పాటు చేస్తున్నాం.

  • 04 May 2022 06:58 PM (IST)

    అధికారంలోకి వచ్చేందుకు..

    టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమి లేదు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన తాగు, సాగు ప్రాజెక్టులనే పేరు మార్చి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది.

  • 04 May 2022 06:52 PM (IST)

    కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది

    టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు బీమా పథకానికి ఎంత మందికి అందించారో స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు. అందులో ఎంత మంది రైతులు మృతి చెందారో ఆ వివరాలను కూడా ఆయన అధికారికంగా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఏడున్నర టీఆర్ఎస్ పాలనలో 82, 400 మంది రైతులు చనిపోయారు.

  • 04 May 2022 06:38 PM (IST)

    వరంగల్‌ సభలో రాహుల్ ఏం చెప్పనున్నారు..

    దొంతు రమేష్, ఇన్‌పుట్‌ ఎడిటర్ : వరంగల్‌లో రాహుల్ గాంధీతో రైతు సంఘర్షణ సభ ఏర్పాటుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్దంగా ఉంటే.. ఆయన మాత్రం పబ్బుల్లో ఉన్నారు.. ఇక్కడికి వచ్చి పబ్బల్లో సంగతులు చెబుతారా అని ఇతర పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏమంటారో చూద్దాం..

     

    టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి: సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మాకు వ్యతిరేక పక్షాలను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టినాం. ఇదంతా టీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం. రాహుల్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు నేపాల్ వెళ్లారు.

Follow us on