స్కూటీ పార్క్ చేసి షాప్‌లోకి వెళ్లాడు.. తిరిగి వచ్చేసరికి ఊహించని సీన్..!
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. తాజాగా శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే దొంగతనం జరిగింది. నిలిపి ఉన్న స్కూటీ డిక్కీలోని నగదును దుండగులు దోచుకెళ్లారు. ఎర్వగూడకి చెందిన ప్రదీప్ గౌడ్ శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకులో డిపాజిట్ చేయడానికి రూ. 2.98 లక్షలు బ్యాంకుకు ఎత్తుకెళ్లాడు.
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. తాజాగా శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే దొంగతనం జరిగింది. నిలిపి ఉన్న స్కూటీ డిక్కీలోని నగదును దుండగులు దోచుకెళ్లారు. ఎర్వగూడకి చెందిన ప్రదీప్ గౌడ్ శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకులో డిపాజిట్ చేయడానికి రూ. 2.98 లక్షలు బ్యాంకుకు తీసుకువెళ్లాడు. అక్కడ జనాలు ఎక్కువగా ఉండడంతో స్కూటీ డిక్కీలో దాచి, తిరిగి పనిచేసే వన్ ల్యాబ్‌కు వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత బయటకు వచ్చిన అతను నగదు చూసుకోగా కనిపించలేదు. దుండగులు స్కూటీలోని నగదునున దోచుకెళ్లినట్లు గుర్తించిన ప్రదీప్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, దుండగులు నగదు ఎత్తుకెళ్లిన దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

