
ముగ్గురు మహిళలు కిరాణా దుకాణంలో ఆయిల్ డబ్బాలు దొంగతనం చేసిన సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో జరిగింది. కాకపోతే చిన్న ట్విస్ట్ సీసీ కెమెరాల్లో ఈ చోరీ దృశ్యాలు చిక్కడంతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
వంటనూనె చోరీ కథ వర్ధన్నపేట మండల కేంద్రంలోని బాలాజీ కిరాణా దుకాణంలో జరిగింది. షాప్ ముందున్న 20 లీటర్ల ఆయిల్ డబ్బా మాయం కావడంతో షాకైన షాప్ యజమాని సీసీ కెమెరా బ్యాకప్ చెక్ చేసుకుని చూడగా.. అందులో కనిపించిన దృశ్యాలు చూసి దెబ్బకు షాక్ అయ్యాడు. ముగ్గురు మహిళలు చాకచక్యంగా ఎలా ఆయిల్ డబ్బా మాయం చేశారో చూసి పోలీసులు సైతం ఖంగుతిన్నారు.
ముగ్గురు గుర్తు తెలయని మహిళలు పక్కా ప్లాన్ ప్రకారం షాప్ వద్దకు వచ్చారు. ఒక మహిళ ముందు నిలబడి షాప్ యజమానితో బేరాలు చేస్తున్నట్లు.. అతడ్ని కన్ఫ్యూజ్ చేసింది. మరో మహిళ షాప్ ముందున్న ఆయిల్ డబ్బాను మాయం చేసి.. వేరే మహిళ చేతుల్లో పెట్టింది. ఇక ఆమె ఎవరి కంటా పడకుండా చేతిలో ఉన్న బ్యాగ్ పక్కన దాచిపెట్టి 20 లీటర్ల ఆయిల్ డబ్బాను పట్టుకొని చిన్నగా ఎస్కేప్ అయిపోయింది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా వెంటనే చోరీ అయిన విషయాన్ని గుర్తించిన షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ కిలాడీ లేడీ గ్యాంగ్ గురించి విచారణ చేపట్టారు.