Hyderabad: ఘోర ప్రమాదం: చెత్తకు పెట్టిన నిప్పు.. మూడు కార్లు బుగ్గిపాలు!
హైదరాబాద్ మహానగరం శివారు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ పరిధిలోని ఒక ఖాళీ ప్రదేశంలో పార్క్ చేసి ఉన్న మూడు కార్లు అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఖాళీ ప్రదేశంలో ఉన్న చెత్తకు నిప్పు పెట్టారు.
హైదరాబాద్ మహానగరం శివారు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ పరిధిలోని ఒక ఖాళీ ప్రదేశంలో పార్క్ చేసి ఉన్న మూడు కార్లు అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఖాళీ ప్రదేశంలో ఉన్న చెత్తకు నిప్పు పెట్టారు. అయితే ఆ మంటలు కాస్తా పక్కనే పార్క్ చేసి ఉన్న కార్లకు వేగంగా వ్యాపించాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో మూడు కార్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అగ్నిమాపక వాహనంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. కార్లకు అంటుకున్న భారీ మంటలను తీవ్రంగా శ్రమించి అదుపులోకి తెచ్చారు. మంటలు పక్కనే ఉన్న ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అడ్డుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పూర్తి వివరాలు, నష్ట తీవ్రతపై విచారణ జరుపుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేూయ
అడవిలో చరిత్ర ఆనవాళ్లు
హుండీ దొంగ అడ్డంగా బుక్
వారెవ్వా.. తొలిరోజే మత్స్యకారులకు జాక్పాట్.. ఒకే సారి
రాత్రివేళ ఒంటరిగా క్యాబ్లో యువతి ప్రయాణం! ఆ డ్రైవర్ చేసిన పనికి
బ్లాక్ మిల్క్.. ప్రకృతి వింత! ఆశ్చర్యపరిచే శాస్త్రీయ నిజం
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్ ఇది!
ఇంట్లో కూలర్ ఆన్ చేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!

