Telangana: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఫ్రైట్‌ కారిడార్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇదొక వరమే..

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. తెలంగాణ మీదుగా ఫ్రైట్ కారిడార్ నిర్మాణానికి ముందడుగు వేసింది. ఇప్పటికే డీపీఆర్ సిద్దం కాగా.. వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నారు. ఇక భూసేకరణ ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఇది తెలంగాణకు ఓ పెద్ద వరంగా చెప్పవచ్చు.

Telangana: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఫ్రైట్‌ కారిడార్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇదొక వరమే..
Frieght Corrider

Updated on: Dec 25, 2025 | 9:04 AM

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. తెలంగాణ మీదుగా ఫ్రైట్ కారిడార్ నిర్మిణానికి పచ్చజెండా ఊపింది. మధ్యప్రదేశ్‌ నుంచి ఏపీ వరకు నిర్మించనున్న ఈ ఫ్రైట్ కారిడార్ తెలంగాణ మీదుగా వెళ్లనుంది. ఇప్పటికే ఈ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్ రైల్వే బోర్డుకు అందింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది. ఈ బడ్జెట్‌లో ఈ ఫ్రైట్ కారిడార్‌కు నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. అదే జరిగితే వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే తెలంగాణకు ఎంతో లాభం జరగనుంది. ఇతర రాష్ట్రాలకు సరుకు రవాణా త్వరగా చేయడంతో పాటు వాణిజ్యపరంగా కూడా ఉపయోగం కలగనుంది.

మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ నుంచి స్టార్ట్ కానున్న ఈ ఫ్రైట్ కారిడార్ కారిడార్ తెలంగాణ మీదుగా విజయవాడ వరకు నిర్మించనున్నారు. దాదాపు 922 కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉండనుంది. దీని ద్వారా గూడ్స్ రైళ్లకు ప్రత్యేక రైల్వే ట్రాక్ అందుబాటులోకి రానుంది. దాంతో సరుకు రావాణా వేగవంతం కావడంతో పాటు భద్రత కూడా పెరుగుతుంది. అలాగే ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్‌లపై ఒత్తిడి కూడా తగ్గుతుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫ్లైట్ కారిడార్ లాజిస్టిక్స్ రంగంలో ఓ పెద్ద విప్లవాత్మక మార్పుగా చెప్పవచ్చు. వేరే ప్రాంతాలకు ఏమైనా సరుకు పంపించాలన్నా దీని ద్వారా ఖర్చు కూడా తగ్గనుంది.

ఈ ప్రాంతాల మీదుగా

కొత్తగా నిర్మించనున్న ఈ  కారిడార్ సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, రామగుండం, కాజీపేట, ఖమ్మం మీదుగా విజయవాడకు వెళ్తుంది. మంచిర్యాలలో సింగరేణి బొగ్గు ఉత్పత్తి ఎక్కువగా ఉండగా.. రామగుండంలో ఎరువుల ఉత్పత్తి కంపెనీలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల నుంచి సరుకును ఇతర ప్రాంతాలకు రవాణా చేయడం మరింత సులువు అవుతుంది. వేగంగా తక్కువ ఖర్చుతో పంపించవచ్చు. రోడ్డు ద్వారా వీటిన రవాణా చేయడం వల్ల కాలుష్యం కూడా పెరుగుతోంది. ఈ ఫ్రైట్‌ కారిడార్ ద్వారా కాలుష్యం కూడా తగ్గనుంది. భారీ వ్యాగ్లన్లతో కూడిన గూడ్స్ రైళ్లను తగ్గుకునేలా అత్యాధునిక టెక్నాలజీతో ట్రాక్స్ నిర్మించనున్నారు.