
టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ నేతలతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఇవాళ అర్థరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడనున్నారు. బుధవారం ఉదయం షిఫ్ట్ నుంచే కార్మికులు విధులు బహిష్కరించనున్నారు. దీంతో అర్ధరాత్రి నుంచి బస్సులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. వేతన సవరణ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఆ హామీని నిలబెట్టకోలేదు. అలాగే వేతన సవరణ, ఇతర ప్రయోజనాలు కల్పించాలని కార్మికులు కోరుతున్నారు.
అయితే ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. సమస్య పరిష్కారానికి నాలుగు వారాల గుడువు ఇవ్వాలని కమిటీ సూచించింది. కానీ కమిటీ ప్రతిపాదనలను జేఏసీ ఒప్పకోలేదు. దీంతో సమ్మె అనివార్యమైందని చెప్పవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా రోజూ లక్షలాది మంది ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇక ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా మహిళలు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు ఆ సేవలు అన్నీ నిలిచిపోనుండటంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించనుంది.
అయితే సమ్మెపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమ్మె పరిష్కారం, ప్రయాణికులకు ఇబ్బందులు కలగవద్దనే ఆలోచనతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ ప్రతినిధులంతా కమిటీకి మీ అంశాలు విన్నవిస్తే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తాను ప్రభుత్వం దగ్గర కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని సమస్యలు పరిష్కారం చేస్తామని స్పష్టం చేశారు. “ఈ బస్సు ప్రయాణం పేదవాళ్ళకి లైఫ్ లైన్.. ఉద్యోగులుగా మీరు, ప్రభుత్వంగా మేము కలిసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ఉంది. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ,ఉద్యోగుల సంక్షేమం ప్రయాణికుల సౌలభ్యం చూస్తాం.. ఎలాంటి బెషజాలలకు పోకుండా అధికారుల కమిటీకి మీ సమస్యలు విన్నవించండి.. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది” అంటూ పొన్నం పేర్కొన్నారు.
ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమ్మె పరిష్కారం, ప్రయాణికులకు ఇబ్బందులు కలగవద్దనే ఆలోచనతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉంది..
ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది.. pic.twitter.com/vrKjVDJDwm
— TGSRTC (@TGSRTCHQ) April 21, 2026