ఎలక్షన్… టెన్షన్… ఎల్బీ స్టేడియం వద్ద ఉద్రిక్తత… ఏపీ మహేష్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల నేపథ్యంలోనే….

ఏపీ మహేష్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. బోగస్ ఓట్లు వేస్తున్నారని ప్రస్తుత బ్యాంక్ చైర్మన్ రమేష్ వర్గంపై  ప్రత్యర్థి భగవతి దేవి వర్గం ఆరోపణలకు దిగింది.

ఎలక్షన్... టెన్షన్... ఎల్బీ స్టేడియం వద్ద ఉద్రిక్తత... ఏపీ మహేష్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల నేపథ్యంలోనే....

Updated on: Dec 20, 2020 | 12:49 PM

ఏపీ మహేష్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. బోగస్ ఓట్లు వేస్తున్నారని ప్రస్తుత బ్యాంక్ చైర్మన్ రమేష్ వర్గంపై  ప్రత్యర్థి భగవతి దేవి వర్గం ఆరోపణలకు దిగింది. దీంతో కొద్ది సేపు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కాగా, ఏపీ మహేష్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్నాయి. దాదాపు 32 వేల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే బోగస్ ఓట్లు వేస్తున్నారని ఇరువర్గాలు దాడులకు దిగడంతో పరిస్థతి అదుపు తప్పింది. దీంతో ఎల్బీ స్టేడియం వద్ద భారీగా పోలీసులను మెహరించారు. కాగా, ఉద్రిక్తతల నేపథ్యంలో జాయింట్ సీపీ విశ్వ ప్రసాద్ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఎటువంటి గొడవలు జరగకుండా టాస్క్ ఫోర్స్ బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us