
రెండు రాష్ట్రాల మధ్య జలజగడం విభజన నాటిదే. కొత్తదేం కాదు. అసలు.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నినాదంలో మొదటి అంశమే.. నీళ్లు. రెండుగా విడిపోయినా.. అవే నీళ్లు, అవే నిప్పులు. విభజన జరిగి పదకొండున్నరేళ్లైనా అదే పంతం, అదే జగడం. కాకపోతే.. రెండు రాష్ట్రాల మధ్య కంటే కూడా రెండు పార్టీల మధ్యే ఎక్కువ కొట్లాట జరుగుతోంది. మీరే తప్పు చేశారని ఒకరు. అంతా మీరే చేసిందే కదా అని మరొకరు. విభజన నాటి నుంచి నీళ్ల విషయంలో ఏం జరిగిందో మళ్లీ తవ్వకుంటున్నారు. ఓ నాలుగు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిపక్షాన్ని ఉద్దేశించి, ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రతిసారి అడ్డుపడకుండా.. సహకరించాలన్నారు. నీళ్ల విషయమే గానీ, మరేదైనా అంశమే గానీ అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధం అన్నారు సీఎం రేవంత్. అదే విషయం కేసీఆర్ ప్రెస్‌మీట్ తరువాత కూడా రిపీట్ చేశారు. ఒక విధంగా కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ అనే అనాలేమో దాన్ని. ఛాలెంజ్ స్వీకరించారో.. లేక సరిగ్గా రెండేళ్ల సమయం ఇచ్చాం ఇక చాలు అనుకున్నారో.. మాజీ సీఎం కేసీఆర్ ఫుల్ ప్రిపరేషన్‌తో మీడియా ముందుకొచ్చారు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడడమే అజెండాగా జనంలోకి వస్తామన్నారు. గులాబీ దళపతి కేసీఆర్ పాయింట్ ఔట్...