Telangana: శ్రీశైలం టూర్ ప్యాకేజీని ప్రారంభించిన తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌.. ధర ఎంతో తెలుసా?

Telangana Tourism Package: మార్గమధ్యలో పర్యాటకులు సాక్షి గణపతి ఆలయాన్ని సందర్శించవచ్చు. వారిని నేరుగా హోటల్‌కు తీసుకెళ్తారు. శ్రీశైలం హోటల్‌లో ప్రత్యేక దుప్పట్లు ఏమి అందించరు. ఎవరి దుప్పట్లు వారే తెచ్చుకోవాల్సి ఉంటుందని గుర్తించుకోండి. శ్రీశైల దర్శనం రెండవ రోజు సాయంత్రం లేదా తెల్లవారుజామున..

Telangana: శ్రీశైలం టూర్ ప్యాకేజీని ప్రారంభించిన తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌.. ధర ఎంతో తెలుసా?
Srisailam

Updated on: Feb 07, 2025 | 10:09 AM

తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) శ్రీశైలం వంటి పట్టణాలకు ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది. ఇలాంటి ప్యాకేజీల ద్వారా ఆలయ పర్యాటకులను ఆకర్షించడానికి వేసవి సెలవులపై దృష్టి సారిస్తోంది. ఇది పెద్దలకు రూ.2,999, పిల్లలకు రూ.2,392 ఖరీదు చేసే రెండు రోజుల ప్యాకేజీని రూపొందించింది. కార్పొరేషన్ అధికారుల ప్రకారం.. శ్రీశైలం టూర్ కోసం రెండు బస్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒక ఏసీ బస్సు కూడా ఉంది. నాన్-ఏసీ బస్సు ప్యాకేజీ రూ. 2,000 (పెద్దలు), రూ. 1,600 (పిల్లలు). పర్యాటకులు రెండు రోజులు వసతి సౌకర్యంతో గడపడానికి వీలుగా ఈ ప్యాకేజీ రూపొందించారు. టూర్ ఉదయం 8:30 గంటలకు టూరిస్ట్ భవన్ నుండి ప్రారంభమవుతుంది. బస్సు CRO బషీర్‌బాగ్ వద్ద ఆగుతుంది. దీంతో అక్కడ ప్రయాణికులు ఎక్కడాల్సి ఉంటుంది. ఇది ఉదయం 9 గంటలకు బయలుదేరుతుంది. దారిలో భోజనం కోసం ఆగుతుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీశైలం చేరుకుంటుంది.

మార్గమధ్యలో పర్యాటకులు సాక్షి గణపతి ఆలయాన్ని సందర్శించవచ్చు. వారిని నేరుగా హోటల్‌కు తీసుకెళ్తారు. శ్రీశైలం హోటల్‌లో ప్రత్యేక దుప్పట్లు ఏమి అందించరు. ఎవరి దుప్పట్లు వారే తెచ్చుకోవాల్సి ఉంటుందని గుర్తించుకోండి. శ్రీశైల దర్శనం రెండవ రోజు సాయంత్రం లేదా తెల్లవారుజామున చేయాలి. అది పర్యాటకుడి ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది.

రెండవ రోజు హోటల్‌లో అల్పాహారం తర్వాత, పర్యాటకులు రోప్‌వే (పాతాళ-గంగా), ఫలధార, పంచధార, శిఖర, చివరకు ప్రతిష్టాత్మకమైన శ్రీశైలం ఆనకట్టను సందర్శిస్తారు. సందర్శన తర్వాత వారిని సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌కు తిరిగి తీసుకువస్తారు. శ్రీశైలంలో వసతి సౌకర్యం నాన్-ఏసీ. టూర్ ప్యాకేజీ బస్సు ఛార్జీలు, వసతిని మాత్రమే కవర్ చేస్తుందని అధికారులు తెలిపారు. భోజనం, ఆలయ సందర్శనలు, ఇతర ప్రదేశాలకు టిక్కెట్ల ఖర్చులను పర్యాటకులే భరించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టూరిజం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి