Telangana Cabinet Meeting: రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం.. పది నిమిషాల్లో ముగిసిన భేటీ..

|

Feb 05, 2023 | 1:38 PM

దాదాపు పది నిమిషాల పాటు జరిగింది క్యాబినెట్ సమావేశం. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు అందరు తప్పకుండా హాజరు కావాలిని ఆదేశించారు సీఎం కేసీఆర్.ప్రాధాన్యాలు, కేటాయింపులు, ప్రతిపాదనలపై సమావేశంలో కీలకంగా చర్చించారు.

Telangana Cabinet Meeting: రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం.. పది నిమిషాల్లో ముగిసిన భేటీ..
CM KCR
Follow us on

తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ భేటీ ముగిసింది. ప్రగతి భవన్‌లో ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సోమవారం (జనవరి 6) శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దాదాపు రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉండే అవకాశం ఉంది. నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి బుణాలు తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దాదాపు పది నిమిషాల పాటు జరిగింది క్యాబినెట్ సమావేశం. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు అందరు తప్పకుండా హాజరు కావాలిని ఆదేశించారు సీఎం కేసీఆర్.ప్రాధాన్యాలు, కేటాయింపులు, ప్రతిపాదనలపై సమావేశంలో కీలకంగా చర్చించారు. ఈ భేటీలో సీఎం కేసీఆర్ మంత్రులకు దిశానిర్ధేశం చేశారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వం తరపున చర్చ, విపక్షాలను ధీటుగా ఎదుర్కోవడం సహా సంబంధిత అంశాలపై కేబినెట్‌లో మార్గనిర్దేశం చేయనున్నారు సీఎం కేసీఆర్.

అసెంబ్లీ సమావేశాల్లో బాగా మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను అభినందించిన క్యాబినెట్ సహచరులు. నాందేడ్ బీఆర్ఎస్ సభకు కేసీఆర్ వెల్లాల్సి ఉన్నందున్న త్వరగా ముగిసింది క్యాబినెస్ సమావేశం.

ఇవాళ నాందేడ్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. జాతీయ స్థాయి పార్టీగా ఆవర్భవించాక.. తొలిగా ఖమ్మం సభ. ఆ తర్వాత పొరుగు రాష్ట్రంలో నిర్వహిస్తున్న మొదటి సభ ఇదే కావడం విశేషం. నాందేడ్ జిల్లాలోని సౌత్, నార్త్, బోకర్, నాయిగాం. ముఖేడ్, డెగ్లూర్, లోహ నియోజకవర్గాలు, కిన్పట్, ధర్మాబాద్ మండలాల నుంచి భారీ జనసమీకరణ చేశారు. వీటితో పాటు.. మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన ఆదిలాబాద్, బోథ్, మథోల్, నిర్మల్, నిజామాబాద్, బోధన్ నియోజవర్గాల నుంచి నాందేడ్ సభకు గులాబీ శ్రేణులు ఇప్పటికే తరిలాయి.

రెండు లక్షల మంది పాల్గొనేలా.. సభా ప్రాంగణాన్ని తీర్చి దిద్దారు. దీంతో ఈ ప్రాంతంలో దారులన్నీ నాందేడ్ వైపే కదులుతున్నాయ్. ఫ్లెక్సీలు, తోరణాలతో నాందేడ్ పూర్తి గులాబీ మయంగా మారిపోయింది. నాందేడ్ సభకు.. కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్కసుమాన్, ఎమ్మెల్యేలు జోగి రామన్న, షకీల్.. టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్.. కొన్నాళ్లుగా ఇక్కడే ఉండి.. సభా ఏర్పాట్లు పర్యవేక్షించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం