అంతా శ్రీనివాసుల మయం.! ఒకే వేదికమీద 50వేల మంది శ్రీనివాస్‌లు చేరితే ఎలా ఉంటుందో తెలుసా?

ఒకే పేరుతో మొదలైన పరిచయం ఐక్యతగా మారి సామాజిక సేవా కార్యక్రమాలకు వేదికగా నిలుస్తోంది తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ. కుల, ప్రాంత, రాజకీయ భేదాలకు అతీతంగా శ్రీనివాస్ అనే పేరున్న వారందరినీ ఒకే తాటిపైకి తెచ్చే లక్ష్యంతో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు 50 వేల మందిని అనుసంధానించే స్థాయికి చేరింది. 2023 అక్టోబర్ 29న పది మందితో మొదలైన ఈ సంస్థ, ప్రస్తుతం 75 వాట్సాప్ గ్రూపులతో విస్తరించింది. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్లలోని జీఎస్ గార్డెన్స్‌లో మూడో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు ఐదు వేల మంది శ్రీనివాసులు ఈ వేడుకకు హాజరై తమ ఆత్మీయ బంధాన్ని, సేవా నిరతిని చాటుకున్నారు.

అంతా శ్రీనివాసుల మయం.! ఒకే వేదికమీద 50వేల మంది శ్రీనివాస్‌లు చేరితే ఎలా ఉంటుందో తెలుసా?
Telangana Srinivasula Seva

Edited By:

Updated on: Oct 26, 2026 | 11:49 AM

శ్రీనివాస్ అనే పేరు కేవలం ఒక వ్యక్తి గుర్తింపు మాత్రమే కాదు, అది వేలాది మందిని ఒకటిగా కలిపే ఒక ఆత్మీయ బంధం అని నిరూపిస్తోంది తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ. కేవలం ఒకే పేరు ఆధారంగా మొదలైన పరిచయం.. నేడు బలమైన ఐక్యతగా మారి, విస్తృత సామాజిక సేవా కార్యక్రమాలకు అద్భుతమైన వేదికగా నిలుస్తోంది. కుల, మత, ప్రాంతీయ, రాజకీయ భేదాలకు అతీతంగా శ్రీనివాస్ అనే పేరు కలిగిన ప్రతి ఒక్కరినీ ఒకే తాటిపైకి తీసుకురావడమే ధ్యేయంగా ఈ సంస్థ ముందుకు సాగుతోంది.

పది మందితో మొదలై.. 50 వేల మందికి విస్తరించి!

2023 అక్టోబర్ 29న కేవలం పది మంది సభ్యులతో చిన్నగా ప్రారంభమైన ఈ సంస్థ ప్రయాణం నేడు ఒక విప్లవంగా మారింది. సాంకేతికతను జోడిస్తూ 75 వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రస్తుతం ఏకంగా 50 వేల మంది శ్రీనివాసులను ఒకే నెట్‌వర్క్‌ కిందకు తీసుకువచ్చారు. ఇప్పటికే రెండు వార్షికోత్సవాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సంస్థ, తాజాగా తన మూడో వార్షికోత్సవ వేడుకలను జగిత్యాల జిల్లా కోరుట్లలోని జీఎస్ గార్డెన్స్‌లో ఎంతో ఘనంగా నిర్వహించింది.

వేలాదిగా తరలివచ్చిన శ్రీనివాసులు

కోరుట్లలో జరిగిన ఈ మూడో వార్షికోత్సవ వేడుకకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల నుంచి సుమారు ఐదు వేల మంది శ్రీనివాసులు హాజరయ్యారు. అంతేకాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా దాదాపు వంద మంది సభ్యులు ప్రత్యేకంగా తరలిరావడం విశేషం. ఈ సందర్భంగా ప్రాంగణమంతా ‘శ్రీనివాస్’ అనే నామస్మరణతో, ఆత్మీయ కలయికలతో ఎంతో కోలాహలంగా మారింది.

ఇవి కూడా చదవండి

సేవా కార్యక్రమాలే ప్రధాన లక్ష్యం

ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ.. శ్రీనివాస్ అనే పేరు తమ మధ్య ఒక గొప్ప ఐక్యతను తెచ్చిపెట్టిందని, ఈ వేదికను కేవలం కలయికలకే పరిమితం చేయకుండా సమాజ సేవకు ఉపయోగించడమే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించడం, పేద విద్యార్థులను చదువులో ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం వంటి సామాజిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ చురుగ్గా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో సభ్యులందరినీ మరింత వేగంగా, సులువుగా అనుసంధానించేందుకు ఒక ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను  కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us