Telangana Schools: రేపటి నుంచి స్కూళ్లు ఓపెన్.. పెరుగుతున్న కేసులతో కలవరం.. బస్సుల ఫిట్‌నెస్‌‌పై అనుమనాలు..!

తెలంగాణలో విద్యాసంస్థలు తెరిచేందుకు ఒక్కరోజే మిగిలి ఉంది. సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్నాయి. కోవిడ్‌ దృష్ట్యా మూడునెలలు ఆలస్యంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది.

Telangana Schools: రేపటి నుంచి స్కూళ్లు ఓపెన్.. పెరుగుతున్న కేసులతో కలవరం.. బస్సుల ఫిట్‌నెస్‌‌పై అనుమనాలు..!
High Court On School
Follow us

|

Updated on: Aug 31, 2021 | 8:05 AM

Telangana School Reopen: తెలంగాణలో విద్యాసంస్థలు తెరిచేందుకు ఒక్కరోజే మిగిలి ఉంది. సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్నాయి. కోవిడ్‌ దృష్ట్యా మూడునెలలు ఆలస్యంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది. ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు కరోనా మూడో దశ ముప్పు ఉన్నందంటూ ప్రీ ప్రైమరీ, ప్రైమరీ తరగతులకూ ప్రత్యక్ష బోధన సరికాదంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాలలు ప్రారంభించిన రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని అమెరికా లాంటి దేశాల్లో విద్యార్థుల్లో పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనం అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పాఠశాల పున ప్రారంభానికి ఒక రోజు మాత్రమే మిగిలి ఉండడంతో హైకోర్టులో ఇవాళ మంగళవారం రాబోయే తీర్పు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు పునః ప్రారంభం అవుతుండడంతో విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పై దృష్టి సారించింది. పాఠశాలల పునః ప్రారంభానికి ఇంకా ఒక రోజే మిగిలి ఉండటంతో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యా శాఖ అన్ని విభాగాల అధిపతులు, వైస్ ఛాన్సలర్స్, డిఈఓ,ఇతర అధికారుల వర్చువల్ మీట్ లో పారిశుధ్య, శానిటైజేషన్, తాగు నీరు,విద్యుత్ సౌకర్యాల పునరుద్ధరణ తదితర వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని.. సహకరించని వారి వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. హాస్టళ్లను కూడా ప్రారంభించాలని అధికారులను ఆదేశించిన మంత్రి.. సీజనల్ వైరస్, వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ రోజు సాయంత్రానికి అన్ని విద్యాలయాలను సిద్ధం చేయాలని .. ప్రయివేటు విద్యా సంస్థలపై కూడా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్ట్ సమయంలో నే అత్యంత జాగ్రత్తలు పాటించాలని అధికారులకు తెలిపారు.

ఇదిలావుంటే కరోనా థర్డ్ వేవ్ తో తీవ్ర పరిణామాలు ఉంటాయని వస్తున్న వార్తలకు గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలే నిదర్శనం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతోంది. దాదాపు 18 నెలలు వేచి ఉన్న ఈ నేపథ్యంలో మరో రెండు నెలలు ఆగి విద్యార్థులకు పూర్తి వ్యాక్సినేషన్ అయిన తరువాత ప్రారంభిస్తే 100% పేరెంట్స్‌లో కాన్ఫిడెంట్ పెరుగుతుందని అంటున్నారు. ప్రత్యక్ష ఫిజికల్ తరగతులు ప్రారంభమైన రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. అమెరికాలో గత పది రోజుల్లోనే వాక్సినేషన్ వేసుకున్న పిల్లల్లోనే లక్షా 80 వేలకు పైగా కేసులు నమోదు కావడం కలవర పెడుతుందంటున్నారు. నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 55 పేజీల పీఎంఓకు సమర్పించిన నివేదికలో థర్డ్ వేవ్ అండ్ చైల్డ్ వల్నరబిలిటీ పై డీటెయిల్ రైటప్ ఉందనీ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోకుండా పాఠశాలలో ప్రారంభించడం సరి కాదని చెబుతున్నారు. ఒక్కసారిగా థర్డ్ వేవ్ విజృంభిస్తే ప్రభుత్వం తీసుకునే చర్యలపై క్లారిటీ లేదంటున్నారు. పిల్లల ఆరోగ్యం, ప్రజారోగ్యం దృక్పథంతోనే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశామని నిపుణులు చెబుతున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా పాఠశాల పున ప్రారంభం పై ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటూ ప్రభుత్వం… ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పాఠశాలలు ప్రారంభమైన రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయనీ పిటిషనర్.. ఇలా ఎవరికి వారు అభిప్రాయం పడుతున్న నేపథ్యంలో ప్రీ ప్రైమరీ, ప్రైమరీ పాఠశాలలు ప్రారంభమవుతాయా లేక నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పీఎంఓకు అందించిన నివేదికల ను పరిశీలించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రేపటి నుంచి రాష్ట్రంలో స్కూళ్లు, కళాశాలలు తెరుచుకోనున్నాయి. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా విద్యాసంస్థలను నిర్వహించేందుకు యాజమాన్యాలు సన్నద్ధమవుతున్నాయి. గ్రేటర్‌లో సుమారు 15 లక్షల మంది విద్యార్థులు సుదీర్ఘ విరామానంతరం పాఠశాలలకు వెళ్లనున్నారు. కానీ.. పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లి, తిరిగి ఇళ్లకు చేర్చేందుకు అవసరమైన స్కూల్‌ బస్సుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. కోవిడ్‌ దృష్ట్యా సుమారు రెండేళ్లుగా స్కూల్ బస్సులు, ఆటోలు, వ్యాన్‌లు తదితర వాహనాలకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిలిచిపోయాయి. ప్రభుత్వమే స్వయంగా మినహాయింపునిచ్చింది. కానీ ఇప్పుడు ఈ ఫిట్‌నెస్‌ లేని వాహనాలే పిల్లలను తరలించే విషయంలో ఆందోళన కలిగిస్తోంది.

Read Also…  Covid Third Wave: అక్టోబర్‌ – నవంబర్‌లో కరోనా థర్డ్‌వేవ్‌.. కీలక విషయాలు వెల్లడించిన కాన్పూర్‌ శాస్త్రవేత్త

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు