దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. చలితో జనాలు గజగజ!

రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత నానాటికీ పెరిగిపోతుంది. తెలంగాణ వాసులు చలికి గజగజ వణుకుతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలలో చలి తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో వాతావరణ అధికారులు పది జిల్లాలకు ఆరెంజ్.. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రాబోయే రెండు, మూడు రోజులు సాధారణ స్థాయి..

దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. చలితో జనాలు గజగజ!
Cold Conditions In Telangana

Updated on: Nov 16, 2025 | 10:34 AM

హైదరాబాద్, నవంబర్‌ 16: రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత నానాటికీ పెరిగిపోతుంది. తెలంగాణ వాసులు చలికి గజగజ వణుకుతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలలో చలి తీవ్రత పెరిగింది. ఈ క్రమంలో వాతావరణ అధికారులు పది జిల్లాలకు ఆరెంజ్.. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రాబోయే రెండు, మూడు రోజులు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా కోహిర్, వికారాబాద్ జిల్లా యాలాల్ లలో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా 8.1 మేర నమోదయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో 8.4 ఉష్ణోగ్రతలు, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ లో 8.6 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో 15 డిగ్రీలలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చలి పులిలా గాలిస్తోంది. దీంతో ప్రజలు చలి మంటలు కాస్తున్నారు. తాజాగా దుబ్బాక ప్రాంతంలో ఉష్ణోగ్రత లెవెల్స్ తీవ్రంగా పడిపోయాయి. ఓ పక్క మంచు దుప్పటి కప్పిస్తుంటే మరోపక్క చలి గజగజ వణికిస్తోంది. నవంబర్ మాసంలోనే చలి ఇంత తీవ్రతగా ఉంటే జనవరి, ఫిబ్రవరి మాసంలో చలి ఎంత తీవ్రంగా ఉంటుందోనని ప్రజలు భయభ్రాంతులకు గులవుతున్నారు. వర్కర్స్ వెచ్చదనం కోసం స్వెటర్స్ ధరించే పనులకు వెళుతున్నారు. ఇంకా రాను రాను చలి తీవ్రత మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. చలి తీవ్రత దృష్ట్యా పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్తే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని, బయటకి వెళ్లే సమయంలో క్యాప్ లు, స్వెటర్స్ ధరించే వెళ్లాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us