AP MLC Elections 2021 Live updates:
తెలంగాణలో స్థానిక సంస్థల కోటా MLC ఎన్నికలు ముగిశాయి. 5 జిల్లాల్లోని ఆరు స్థానాలకు పోలింగ్ జరిగింది. దాదాపు అన్ని చోట్ల 90 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది..ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, మొదక్ జిల్లాల్లో ఒక్కో స్థానం..కరీంనగర్‌లో రెండు స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం ఓటర్లు 5 వేల 326 మంది. ఐదు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 37 పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ ద్వారా ఓటింగ్ ప్రక్రియ మొత్తం రికార్డు చేశారు. 14న ఫలితాలు ప్రకటిస్తారు.
లోకల్‌బాడీ కోటాలో మొత్తం 12 MLC స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల సంఘం. అయితే ఇందులో ఆరు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఈ ఆరు చోట్ల అధికార TRS పార్టీ అభ్యర్థులే గెలిచారు. మిగిలిన ఆరు స్థానాల్లో ఇవాళ పోలింగ్ జరిగింది. ఎన్నికలు జరిగిన ఐదు జిల్లాల్లోనూ గులాబీ దళానిదే మెజార్టీ. అయితే క్రాస్ ఓటింగ్ భయంతో జాగ్రత్తపడింది అధికార పార్టీ. ఖమ్మం, మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్ పోటీలో ఉంది. కరీంనగర్‌లో TRSకు రాజీనామా చేసిన మాజీ మేయర్ రవీందర్‌సింగ్ పోటీ చేశారు. ముందుజాగ్రత్తగా ఓటర్లను క్యాంప్‌లకు తరలించిన అధికార పార్టీ..ఓటర్లు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంది.
జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. కరోనా నిబంధనలను అనుసరిస్తూ పోలింగ్ నిర్వహించారు. సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ ఓటు వేశారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటేశారు మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సుల్ని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. 14వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. మధ్యాహ్నం కల్లా ఫలితాలు వెల్లడికానున్నాయి..
ఉమ్మడి మెదక్ జిల్లాలో మ.2 గంటల వరకు 96.69 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక ఖమ్మం జిల్లాలో మ.2 గంటల వరకు 79.95 శాతం పోలింగ్ జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో మ.2 గంటల వరకు 87.73 శాతం పోలింగ్ జరిగింది.
ఖమ్మం జిల్లా MLC ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికార పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ కాంగ్రెస్ ధర్నాకు దిగింది.ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌కేంద్రంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రజాప్రతినిధులందరూ ఓటు వేయాలని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. జిల్లాలో 99 శాతం ఓటింగ్ జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 1324 మంది ఓటర్లు ఉన్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. జడ్పీ ఛైర్మన్ రాఠోడ్ జనార్ధన్‌తో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతోపాటు ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో 42 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లిన సీఈవో శశాంక్ గోయల్ ఓటింగ్ సరళిని పరిశీలించారు.
తెలంగాణలో కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ఉమ్మడి మెదక్ జిల్లాలో మ.12 గంటల వరకు 42.1 శాతం పోలింగ్ జరిగింది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మ.12 గంటల వరకు 21.22 శాతం పోలింగ్ నమోదైంది.
ఖమ్మం ఆర్డిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఖమ్మం ఎం పి. నామా నాగేశ్వరరావు.
మరోవైపు హుజురాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటర్ లిస్ట్‌లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరు నమోదు కాలేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ లిస్ట్ సవరణ సమయానికి ఈటలఎమ్మెల్యేగా లేకపోవడంతో ఓటర్ లిస్ట్‌లో పేరు నమోదు కాలేదు.
ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కల్లూరు ఆర్డీవో కార్యాలయం లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు పేరువంచ ఎంపీటీసీ. అటు ఎంపీటీసీ,జడ్పీటీసీ ల ఫోరం అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగుతోంది. సంగారెడ్డి టిఎన్జీవో భవన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నిర్మల జగ్గారెడ్డి.
మెదక్ జిల్లా కేంద్రంలోని బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటుహక్కు వినియెగించుకునేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు తరలి వస్తున్నారు. పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి హరీష్ సందర్శించారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం తొమ్మిది పోలింగ్ కేంద్రాలున్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఓ చోట స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ ఏజెంట్‌ను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించకపోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో కలెక్టర్ ఎదుటే పోలింగ్ ఏజెంట్, డీఎస్పీ వాగ్వాదానికి దిగారు. స్వతంత్ర అభ్యర్థి పెందురి పుష్పరాణి ఎలక్షన్ ఏజెంట్‌ను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించలేదు పోలీసులు. పోలింగ్ ఏజెంట్ ని, డీఎస్పీ వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. దీంతో కలెక్టర్ ఎదుటే వీరిద్దరు వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగేలా చేశారు ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా తమ ఓటు వినియోగించుకోవాలని సూచించారు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భైంసా లో భారీ పోలీస్ బందోబస్తు మధ్య పోలీస్ పహారాలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. భైంసా లో ఇద్దరికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. భైంసా కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు హైదరాబాద్ చెంచల్ గూడ జైలులో ఖైధీలుగా ఉన్నారు.. దీంతో ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వారు ఎన్నికల కమిషన్ కు వివిధ ఫామ్స్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ అంగీకారం తెలిపింది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఖమ్మం, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. దీని కోసం మొత్తం 37 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈనెల 14న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు.
ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఐదు జిల్లాల్లోనూ గులాబీ దళానిదే మెజార్టీ. ప్రస్తుత బలాబలాల ప్రకారం సువులుగా విజయం సాధిస్తుంది. ఖమ్మం, మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్ పోటీలో ఉంది.
లోకల్‌బాడీ కోటాలో మొత్తం 12 MLC స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల సంఘం. అయితే ఇందులో ఆరు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఈ ఆరు చోట్ల అధికార TRS పార్టీ అభ్యర్థులే గెలిచారు. మిగిలిన ఆరు చోట్ల రేపు పోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఇవాళ తెలంగాణ స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమయింది. ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
ఆరు స్థానాలకు పోటీలో 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటుహక్కు వినియోగించుకోనున్నారు 5,326 ప్రజాప్రతినిధులు. ఈనెల 14న ఓట్ల లెక్కింపు.. పోలింగ్ సమయంలో కోవిడ్ రూల్స్ మస్ట్‌గా పాటించాలని ఈసీ ఆదేశించింది.