Vemula Prashanth Reddy: ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం.. ఘాటు వ్యాఖ్యలతో అటాక్

తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నేపథ్యంలో తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాయలసీమ ఎత్తిపోతల పథకం..

Vemula Prashanth Reddy: ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం.. ఘాటు వ్యాఖ్యలతో అటాక్
Vemula Prashanth Reddy
Follow us

|

Updated on: Jun 22, 2021 | 4:09 PM

తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నేపథ్యంలో తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్‌డీఎస్ విస్తరణ జరుగుతుండగా, ఇటు తెలంగాణలో కొత్త ప్రాజెక్ట్‌లకు రూపకల్పన జరుగుతోంది. ఈ పరిస్థితులు రెండు రాష్ట్రాల మధ్య మరోసారి నీటి యుద్ధానికి దారితీస్తున్నాయి. ఇటు వైపు, అటు వైపు నుంచి మంత్రుల స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఆర్‌డీఎస్ విస్తరణ పనులతో మొదలైన ఈ జగడం మరింత పెద్దదవుతోంది. ఈ నేపథ్యంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి. లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులేనని, ఆంధ్రోళ్లు అందరూ తెలంగాణ వ్యతిరేకులేని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రాజెక్ట్‌లపై యుద్ధానికి సిద్ధం కావాలని పాలమూరు ప్రజలకు పిలుపునిచ్చారు. అక్రమ ప్రాజెక్ట్‌లను ఆపకపోతే పోరాటం తప్పదని ఏపీ సీఎం జగన్‌ను హెచ్చరించారు తెలంగాణ మంత్రి. కొత్త ప్రాజెక్ట్‌లు కట్టడం లేదని గ్రీన్‌ట్రిబ్యునల్‌కు చెప్పి దొంగతనంగా కడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ అన్ని వివరాలు తెప్పించారని, త్వరలోనే ప్రధానికి కూడా ఫిర్యాదు చేస్తారని చెప్పారు. అయినా ప్రాజెక్ట్‌లు ఆపకపోతే యుద్ధం తప్పదని హెచ్చరించారు ప్రశాంత్‌రెడ్డి. ఈ సందర్భంలోనే దివంగత నేత వైఎస్‌పైనా విమర్శలు చేశారు ప్రశాంత్‌రెడ్డి. ఆంధ్రోళ్లంతా తెలంగాణ వ్యతిరేకులేనని వ్యాఖ్యానించారు.

తెలంగాణ మంత్రి వ్యాఖ్యలపై కర్నూలు జిల్లా టిడిపి నేతలు ఫైర్

తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆంధ్ర ప్రజలను లంక వాసులతో  పోల్చడంపై.. మండిపడ్డారు  కర్నూలు జిల్లా టిడిపి నేతలు. ఎప్పుడో జరగాల్సిన ఆర్‌డీఎస్ కుడి కాలువ పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కృష్ణ, గోదావరి ట్రిబ్యునల్ నుండి ఇష్టం వచ్చినట్టి జలచౌర్యం చేస్తుందని ఆరోపించారు కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ తిక్కారెడ్డి. తమకు రావాల్సిన 4టీఎంసీల నీటి వాటా ప్రకారం టెండర్ వేసి కుడి కాలువ పనులు జరుగుతున్నాయని చెప్పారాయన. మంత్రాలయం నియోజవర్గంలో తాగునీటికి, రాఘవేంద్ర స్వామి అభిషేకం కూడా నీరు దొరకని పరిస్థితి ఉందని పేర్కొన్నారు.

Also Read:  ఆ మహిళలకు గుడ్ న్యూస్.. ఖాతాల్లో నేరుగా నగదు జమ

యువతిపై అత్యాచార ఘటనపై స్పందించిన సీఎం జగన్..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో