తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన రెండో జాబితా నేడు విడుదల కానుంది. కాగా… గత నెలలో మొదటి విడత ప్రవేశాల ఫలితాలను టీజీసెట్ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విడుదల చేశారు. ప్రస్తుతం విద్యార్థులకు వర్చువల్ విధానంలో తరగతులు జరుగుతున్నాయి. అంతేకాకుండా గురుకులాల పరిధిలో తొమ్మిదో, పదో తరగతి విద్యార్థులు నేరుగా తరగతులకు హాజరవుతున్నారు. హాస్టళ్లు ప్రారంభమయ్యాయి.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన రెండోవిడుత జాబితాను టీజీసెట్ కన్వీనర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నారు. ఈ నెల ఐదు నుంచి 15వ తేదీలోగా ఎంపికైన విద్యార్థులు హాస్టళ్లలో చేరాలని అధికారులు సూచిస్తున్నారు. ఫలితాలు http://tgcet.cgg.gov.in వెబ్‌సైట్‌లో ఉంటాయని తెలిపారు. విద్యార్థులు గమనించాలని కోరారు.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం ప్రస్తుతం అత్యధిక పోటీ నెలకొంది. గురుకుల విద్యార్థులు ఉన్నత చదువుల్లో ప్రతిభ కనబరుస్తుండడంతో తెలంగాణ వ్యాప్తంగా గురుకుల పాఠశాలలకు మంచి గుర్తింపు వస్తోంది. అంతే కాకుండా గురుకులాల్లో చదివిన విద్యార్థులు ఎన్ఐటీలు, ఎంబీబీఎస్ సీట్లు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు పెందుతుండడంతో గురుకుల విద్యపై తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు.
Also Read: