Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారా..? ఈ నగరాల్లో కూడా టవర్ల నిర్మాణం.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల టవర్లను మరికొన్ని జిల్లాల్లో నిర్మించేందుకు సిద్దమవుతోంది. ఇందుకోసం తొలుత నాలుగు నగరాలను ఎంపిక చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈవివరాలు చూద్దాం,.

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారా..? ఈ నగరాల్లో కూడా టవర్ల నిర్మాణం.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
Indiramma Houses

Updated on: Nov 09, 2026 | 12:49 PM

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి రేవంత్ సర్కార్ తీపికబురు అందించింది. విడతల వారీగా ఈ పథకాన్ని అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నగరంలో లాటరీ ప్రక్రియ ద్వారా లబ్దిదారులకు ఈ టవర్స్‌లో ఫ్లాట్ కేటాయించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఫ్లాట్‌ను లబ్దిదారులకు అందించనున్నారు. సొంత నియోజకవర్గ పరిధిలోనే లబ్దిదారులకు ఫ్లాట్ కేటాయించనున్నారు. అయితే హైదరాబాద్ తరహాలో రాష్ట్రంలోని మరో నాలుగు నగరాల్లో కూడా ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీని గురించి తాజాగా అధికారిక ప్రకటన చేశారు.

ఈ 4 నగరాల్లో ఇందిరమ్మ టవర్స్

కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ కార్పొరేషన్లలో త్వరలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మించనున్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తొలి విడతో ఈ నాలుగు నగరాల్లో టవర్లు నిర్మించి లబ్దిదారులకు ఫ్లాట్లను కేటాయిస్తామని తెలిపారు. జీ+5 తరహాలో భవనాలు నిర్మిస్తామని చెప్పారు. త్వరలో దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ నగరాల్లో టవర్ల నిర్మాణం కోసం ప్రభుత్వ భూములను అధికారులు గుర్తించారు. ఈ స్థలాల్లోనే భవన సముదాయాలు నిర్మించనున్నారు. లబ్దిదారులను ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందించనున్నారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షలు మంజూరు చేయగా.. ఇప్పటివరకు 2,21,500 ఇళ్లకు గృహప్రవేశాలు పూర్తయ్యాయి. దీపావళి సందర్భంగా ప్రభుత్వం మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకలు జరగ్గా.. ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న నిర్మాణాలు

హైదరాబాద్‌లో ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక పూర్తి కావడంతో వారికి మంజూరు మంత్రాలు అందించనున్నారు. తొలి విడతగా వారి నుంచి రూ.లక్ష ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వం ఒక్కొ ఫ్లాట్‌కు రూ.5 లక్షల ఆర్దిక సాయం అందించనుడగా.. మిగతా సొమ్ము లబ్దిదారులు భరించాల్సి ఉంటుంది. అయితే కొంతమంది రూ.లక్ష డిపాజిట్ చేయకపోవడంతో వారి పేర్లను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారు. వారి స్థానంలో కొత్తవారి కోసం లాటరీ ఇటీవల నిర్వహించారు. పలు నియోజకవర్గాల్లో లబ్దిదారులకు ముందుకు రావడం లేదు. చాలామంది వెనుకడుగు వేస్తున్నారు.  ఆర్ధిక స్తోమత కారణంగా కొంతమంది డబ్బులు డిపాజిట్ చేయడం లేదు. అయితే ఇప్పటికే ప్రభుత్వం స్థలాలను గుర్తించింది. దీంతో త్వరలోనే భవన నిర్మాణాలు స్టార్ట్ కానున్నాయి.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us