AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మానవత్వమా నీవెక్కడ..? బస్టాండ్‌లో ఫిట్స్‌తో కుప్పకూలిన వ్యక్తి.. చుట్టూ జనం ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు..

ఫిట్స్ వచ్చి పడిపోతున్నప్పుడే ఇంతమందిలో ఏ ఒక్కరు సకాలంలో స్పందించిన ఉన్నా అతను బతికి ఉండేవాడు. కాని మానవత్వంలేకుండా జనం ప్రవర్తించిన తీరు చూసి గద్వాల్ పోలీసులే చలించిపోయారు. ఇంతఘోరం ఎక్కడా చూడాలేదంటున్నారు. పబ్లిక్ ఏమైనా భయపడి దూరం ఉండి పోయారా అంటే అక్కడేమీ కత్తులు కటార్లు పట్టుకుని నెత్తురోడలేదు. గన్‌లు బుల్లెట్లు లేవు. అయినా ఒక్కరిలో మానవత్వం లేదు. ఓపికలేకపోయినా ఓ వృద్ధుడు మాత్రం వెంటనే లేచి అతనికి ఏదో అవుతోంది అని చెప్పినా మిగతావాళ్లెవరూ పట్టించుకోలేదు.

మానవత్వమా నీవెక్కడ..? బస్టాండ్‌లో ఫిట్స్‌తో కుప్పకూలిన వ్యక్తి.. చుట్టూ జనం ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు..
Gadwal Bus Stand Incident
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Nov 09, 2026 | 9:18 AM

Share

జోగులాంబ గద్వాల్: మనిషికి కష్టం వచ్చినప్పుడు ఆదుకునే మరో మనిషి ఉంటాడనే నమ్మకమే సమాజానికి బలం. ఆపదలో ఉన్నప్పుడు చిన్న సాయం కూడా ఒక ప్రాణాన్ని నిలబెట్టగలదు. .. కానీ, “పక్కన ఉన్న మనిషి చచ్చిపోతున్నా పట్టించుకోని వికృత సమాజం ఇది” అని నిరూపించే అత్యంత బాధాకరమైన ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. చుట్టూ వందలాది మంది జనం ఉన్నా, ఒక్కరి గుండెలోనూ కనీస ఈరము లేకపోవడంతో ఓ వ్యక్తి ప్రాణం సకాలంలో వైద్యం అందక కళ్లముందే పోయింది. గద్వాల్ బస్టాండ్ ఆవరణలో ఒక వ్యక్తి హఠాత్తుగా తీవ్రమైన ఫిట్స్ (కాన్వల్షన్స్) వచ్చి కిందపడిపోయాడు. కొన్ని నిమిషాల పాటు ఆయన నరకయాతన అనుభవిస్తూ విలవిల్లాడిపోయాడు.

అసలేం జరిగిందంటే..

నవంబర్ 10 2026.. ఆదివారం తెల్లవారుజామున గద్వాల్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ వ్యక్తి ఫిట్స్‌తో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాపాయ స్థితిలో విలవిలలాడసాగాడు. అయితే, చుట్టూ వందలాది మంది ప్రయాణికులు, స్థానికులు ఉన్నారు. కానీ, ఏ ఒక్కరూ అతడిని కాపాడేందుకు ముందుకు రాలేదు. కొందరు ఫోన్లలో రీల్స్ చూస్తూ ఉండిపోతే, మరికొందరు తమ పనుల్లో తాము మునిగిపోయారు. ఆ సమయంలో అతడికి కావాల్సింది పెద్ద సాయం కాదు… ప్రాణాలు కాపాడేందుకు ఓ చిన్న మానవీయ స్పందన..

వీడియో చూడండి..

అదే సమయంలో ఒక వృద్ధుడు లేచి “అయ్యో.. అతనికి ఏదో అవుతోంది, కాపాడండి” అని మొరపెట్టుకున్నా అక్కడ ఉన్న ఎవరూ స్పందించలేదు.

చివరకు ఓ ప్రయాణికుడు స్పందించి 108కు సమాచారం అందించడంతో సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. బాధితుడిని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడిని ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తలుపుల గ్రామానికి చెందిన షేక్ అదాం వలీగా గుర్తించారు. వ్యాపార నిమిత్తం గద్వాల్‌కు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సొంత ఊరికి దూరంగా వచ్చిన ఆ వ్యక్తి… తిరిగి ఇంటికి చేరకుండానే మృత్యువాత పడ్డాడు. ఆయన కోసం ఎదురుచూస్తున్న కుటుంబానికి ఈ మరణం తీరని విషాదాన్ని మిగిల్చింది.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పోలీసులు..

జనం ప్రవర్తించిన తీరుపై గద్వాల్ పోలీసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడ ఎలాంటి గొడవలు, ఆయుధాలు లేదా బెదిరింపులు లేవు. కేవలం కాస్త మానవత్వంతో ఎవరైనా ముందుకు వచ్చి వెంటనే 108కి సమాచారం ఇచ్చి ఉంటే లేదా ప్రథమ చికిత్స అందించి ఉంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా బతికేవాడు.. అంటూ పోలీసులు ఆవేదన వ్యక్తంచేశారు. అనాథలా కళ్లముందే ప్రాణాలు వదులుతున్నా స్పందించని ఈ ఘటన, నేటి సమాజంలో చచ్చిపోతున్న మానవత్వానికి నిలువెత్తు అద్దం పడుతోంది.

ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు మనం చేసే చిన్న సాయం కూడా ఎంతో విలువైనది. కనీసం అత్యవసర సేవలకు సమాచారం అందించడం, బాధితుడికి వైద్య సహాయం అందేలా చూడటం మనందరి బాధ్యత. ఆపదలో ఉన్న వ్యక్తికి చుట్టూ ఎంతమంది ఉన్నారన్నది కాదు… వారిలో స్పందించే మనసు ఎంతమందికి ఉందన్నదే ముఖ్యం. గద్వాల్ బస్టాండ్ ఘటన సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.

Follow Us
కళ్లముందే కుప్పకూలిన మనిషి.. చుట్టూ జనం ఉన్నా దక్కని సాయం..
కళ్లముందే కుప్పకూలిన మనిషి.. చుట్టూ జనం ఉన్నా దక్కని సాయం..
అరుదైన ఘనత.. ముఖంపై మచ్చ లేకుండానే పుర్రె అడుగున కణితి తొలగింపు!
అరుదైన ఘనత.. ముఖంపై మచ్చ లేకుండానే పుర్రె అడుగున కణితి తొలగింపు!
దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌లో ఎంతంటే?
దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌లో ఎంతంటే?
కూర అవసరమే లేదు ఈ చారు చేస్తే.. కడుపు నిండుగా తింటారు!
కూర అవసరమే లేదు ఈ చారు చేస్తే.. కడుపు నిండుగా తింటారు!
నవంబర్ 11 నుంచి SSC పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజు చెల్లింపులు షురూ..
నవంబర్ 11 నుంచి SSC పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజు చెల్లింపులు షురూ..
3వ వన్డేలోకి ఛోటా ప్యాకెట్ ఎంట్రీ.. ఎవరు తప్పుకున్నారంటే?
3వ వన్డేలోకి ఛోటా ప్యాకెట్ ఎంట్రీ.. ఎవరు తప్పుకున్నారంటే?
సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.
సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!