Kaleshwaram Project: రైతన్నలకు గుడ్‌న్యూస్.. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దెబ్బతిన్న కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం సిద్ధమైనట్టు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తాజాగా కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్.. 2027 వర్షాకాలానికి ముందే పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

Kaleshwaram Project: రైతన్నలకు గుడ్‌న్యూస్.. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!
Kaleshwaram Project Restoration

Updated on: Sep 26, 2026 | 5:42 PM

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్‌లోని మూడు బ్యారేజ్‌ల పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తాజాగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై సమీక్షించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సమావేశం తర్వాత మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల పునరుద్ధరణకు డిజైన్లు ఖరారు చేశామని.. అక్టోబర్ 5న సీడబ్ల్యూసీ సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ముందుకు ఈ డిజైన్లు తీసుకొస్తామని తెలిపారు.

ఇప్పటికే బ్యారేజీల పునరుద్ధరణకు NDSA అభ్యంతరాలు, నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకున్నామని.. సాంకేతిక అనుమతులు వచ్చాక టెండర్లు పిలుస్తామన్నారు. నవంబర్‌లో పునరుద్ధరణ పనులు ప్రారంభించి.. 2027 వర్షాకాలానికి ముందే ఈ మూడు బ్యారేజీల పునరుద్ధరణ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. అలాగే భద్రత, నాణ్యతలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు.

అసలేంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇష్యూ..

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణలోని సాగునీటి అవసరాల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ కాళేశ్వరం.. ఈ ప్రాజెక్టులో మొత్తం మూడు బ్యారేజ్‌లు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మించారు. అయితే భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్ 21వ తేదీన కుంగినట్టు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా బ్యారేజీలోని 7వ బ్లాక్‌లో ఉన్న 19, 20, 21వ పిల్లర్లు భూమిలోకి కుంగాయని నాటి ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో అప్పటి నుంచి డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు ఈ బ్యారేజీలో నీటిని నిల్వ చేయడం ఆపేశారు.

ఇక తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్.. 2027 జూన్-జూలై నాటికి బ్యారేజ్‌ల పునరుద్ధరణ పూర్తి చేస్తామని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us