తెలంగాణకు చెందిన పలు నిర్మాణాలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న విషయం విధితమే. హైదరాబాద్ నగరానికే ఐకాన్‌గా నిలిచిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, బీఆర్అంబేడ్కర్ సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్‌సెంటర్, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, మొజాంజాహీ మార్కెట్‌లకు అంతర్జాతీయ గ్రీన్ యాపిల్ అవార్డులు లభించాయి. ఈ నిర్మాణాలకు ఇంటర్నేషనల్బ్యూటిఫుల్ బిల్డింగ్స్గ్రీన్యాపిల్ అవార్డులు దక్కాయి.
లండన్‌కు చెందిన గ్రీన్ఆర్గనైజేషన్సంస్థ ఈ అవార్డులను ఏటా అందిస్తుంది. ఈ ఐదు అవార్డులను పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్కుమార్స్వీకరించారు. అవార్డులు రావడం పట్ల తెలంగాణ ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది. 9 ఏళ్ల చరిత్ర గల రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే ఇంతటి ఘనతను సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని నిర్మాణాలు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకోనుండడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతేకాకుండా ఒక్క తెలంగాణకే ఐదు విభాగాల్లో అవార్డులు రావడం మరో విశేషం.
Another day, another milestone for #Telangana. ✌?#MissionBhagiratha congratulates Ministry of MA & UD for achieving what no other state in India has achieved till date.
Telanagana grabs 5 Green Apple Awards from London based non-profit organisation, The Green Organisation for… pic.twitter.com/Gei437nZkM
— Mission Bhagiratha Official (@mb_telangana) June 15, 2023
ఇదిలా ఉంటే గ్రీన్ యాపిల్ సంస్థ 2016 నుంచి అవార్డులను ప్రదానం చేస్తోంది. ఇందులో భాగంగా పర్యావరణహిత కార్యక్రమాలను ప్రోత్సాహించే విషయంలో విశాలమైన ప్రాంతాల్లో నిర్మాణాలు వంటివి పరిగణనలోకి తీసుకుంటారు. పర్యావరణం విషయంలో కృషి చేస్తున్న సంస్థలు, సంఘాలకు అవార్డులు ఇస్తుంటారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..