AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కరెంట్ బిల్లులపై తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఏడాది పాటు పెంపు లేనట్లే..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది, విద్యుత్ వినియోగదారుల నుంచి ఏడాది పాటు సర్ ఛార్జి వసూలు చేయకూడదని నిర్ణయించింది. దీంతో కరెంట్ బిల్లులు ఇప్పట్లో పెరగవు. సామాన్య ప్రజలకు ఇది ఊరటగా చెప్పవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Telangana: కరెంట్ బిల్లులపై తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఏడాది పాటు పెంపు లేనట్లే..
Power Bill
Venkatrao Lella
|

Updated on: Apr 21, 2026 | 4:52 PM

Share

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త తెలిపింది. విద్యుత్ ఛార్జీలపై భారీ ఉపశమనం కలిగించింది. విద్యుత్ సర్‌ఛార్జి వసూలు చేయకుండా ఏడాదిపాటు నిలిపివేసింది. ఈ మేరకు ట్రూఅప్ పేరుతో వినియోగదారుల నుంచి సర్ ఛార్జీ వసూలు చేయడంపై ఏడాది పాటు నిలిపివేస్తున్నట్లు విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) ప్రకటించింది. దీంతో ప్రజలకు కరెంట్ బిల్లుల భారం తగ్గనుంది. ఈ నిర్ణయంతో కరెంట్ బిల్లులు పెరిగే అవకాశం లేకుండా పోయింది. విద్యుత్ కొనుగోళ్ల ఖర్చును ప్రజలకు బదిలీ చేసేందుకు సర్ ఛార్జి పేరుతో యూనిట్‌కు 30 పైసల వరకు వసూలు చేసేందుకు డిస్కంలకు అనుమతి ఉంది. కానీ ఇందుకు ప్రభుత్వం, ఈఆర్‌సీ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. వసూలకు అనుమతి ఇవ్వకపోడం వల్ల 2023-25 మధ్య డిస్కంలపై రూ.10 వేల కోట్ల భారం పడింది.

ఏడాది పాటు ఊరట

ఇక ఏడాది పాటు వసూలు చేయకపోవడం వల్ల వడ్డీ రూపంలో రూ.300 కోట్లు డిస్కంలు నష్టపోనున్నాయి. ఏడాది తర్వాత ప్రభుత్వం వసూలు చేయకూడదని అనుకుంటే.. డిస్కంలకు ప్రభుత్వం ఈమొత్తాన్ని అందించాల్సి ఉంటుంది. సర్ ఛార్జిని వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈఆర్‌సీని డిస్కంలు కోరాయి. ఇందుకోసం పిటిషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం సర్‌ఛార్జి వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని తాము కోరడం లేదని పిటిషన్లలో డిస్కంలు తెలిపాయి. కాగా గత రెండేళ్లల్లో విద్యుత్ కొనుగోలు, ఇతర ఖర్చుల వల్ల డిస్కంలపై రూ.7,635 కోట్ల భారం పడింది. వీటిని ప్రజలకు బదిలీ చేయకుండా ఏడాది పాటు సర్ ఛార్జి వసూలును నిలిపివేశారు.

త్వరలో రైతు డిస్కం ఏర్పాటు

డిస్కంలకు ఖర్చులు పెరిగితే ట్రూఅప్ అని పిలుస్తారు. అదే ఖర్చు తగ్గితే ట్రూడౌన్ అని పిలుస్తారు. ట్రూఅప్ అంటే సర్ ఛార్జి పేరుతో వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. దీని వల్ల కరెంట్ బిల్లు పెరుగుతుంది. ఇక ట్రూడౌన్ విధిస్తే కరెంట్ బిల్లులు తగ్గుతాయి. అయితే త్వరలో తెలంగాణ రైతు డిస్కం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ డిస్కం వల్ల విద్యుత్ రంగంలో నూతన సంస్కరణలు ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో సర్ ఛార్జిలు వసూలు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న  ఈ నిర్ణయంతో డిస్కంలపై భారం పడనుండగా.. ప్రజలకు మాత్రం ఊరటగా చెప్పవచ్చు. ఇప్పటికే నిత్యావసరాల ఖర్చులు పెరగడంతో సామాన్యులపై భారం పడుతోంది. ఇప్పుడు కరెంట్ బిల్లులు పెరిగే అదనపు భారం పడుతుంది. ఈ ఉద్దేశంతో ప్రభుత్వం భారం వేయకూడదని నిర్ణయించింది.

Follow Us
మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి
మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి
హీరో గోపీచంద్ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా? కేవలం 19 ఏళ్లకే..
హీరో గోపీచంద్ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా? కేవలం 19 ఏళ్లకే..
ఏఐ నియంత్రణకు కేంద్రం తెస్తున్న కొత్త చట్టం విశేషాలివే
ఏఐ నియంత్రణకు కేంద్రం తెస్తున్న కొత్త చట్టం విశేషాలివే
నా ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేశారు.. హీరోయిన్..
నా ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేశారు.. హీరోయిన్..
ఈ సందర్భానికైనా సూట్‌ అయ్యే 5 అదిరిపోయే వాచీలు
ఈ సందర్భానికైనా సూట్‌ అయ్యే 5 అదిరిపోయే వాచీలు
వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు
వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం