Telangana: కేవలం రూ.10కే యూరియా బుకింగ్.. తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్

తెలంగాణ రైతులకు శుభవార్త.. ఇక నుంచి మీ సేవ కేంద్రాల ద్వారా యూరియా బుక్ చేసుకోవచ్చు. రూ.10 రుసుం చెల్లించి మీ సేవలో బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ ఐడీ 48 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. దీంతో సమీపంలోని డీలర్ల వద్దకు వెళ్లి యూరియా తీసుకోవచ్చు.

Telangana: కేవలం రూ.10కే యూరియా బుకింగ్.. తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్
Telangana

Updated on: Jul 08, 2026 | 9:14 PM

రైతులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఇక నుంచి యాప్ ద్వారానే కాకుండా మీ సేవ కేంద్రాల ద్వారా కూడా యూరియా బుకింగ్ చేసుకోవచ్చు. యాప్ లేకుండా మీ సేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఓటీపీ ధృవీకరణతో వెంటనే బుకింగ్ ఐడీ వస్తుంది. ఈ ఐడీ 48 గంటల పాటు చెల్లుబాటు అవుతుంది. ఎంపిక చేసిన డీలర్ల వద్ద మాత్రమే యూరియా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బుకింగ్ కోసం మీ సేవలో రూ.10 రుసుం నిర్ణయించారు. నామమాత్రపు రూ.10 రుసుం చెల్లించి యూరియా బుక్ చేసుకోవచ్చు. చాలామంది రైతులకు యాప్ ఎలా వాడాలనేది తెలియదు. నిర్లక్షరాస్యులైన రైతులకు యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవడం అనేది కష్టతరంగా మారింది. దీంతో మీ సేవ ద్వారా కూడా బుకింగ్ చేసుకునేలా ప్రభుత్వం కొత్త అవకాశం కల్పించింది.

అన్ని జిల్లాల్లో అందుబాటులోకి..

కాగా యూరియా కోసం రైతులు షాపుల ముందు నిలబడి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ ఈ ఏడాదిలో అందుబాటులోకి తెచ్చింది. తొలుత కొన్ని జిల్లాల్లో ఈ యాప్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించగా.. ఇప్పుడు అన్ని జిల్లాలను విస్తరించింది. దీంతో యాప్ ద్వారా బుకింగ్స్ పెరుగుతున్నాయి. కానీ టెక్నాలజీపై అవగాహన లేకపోవడం వల్ల రైతులు కొంతమంది ఈ సేవలను ఉపయోగించుకోలేకపోతున్నారు. మొబైల్ నెంబర్ ద్వారా ఈ యాప్‌లోకి లాగిన్ అయ్యాక ఎంత పరిమాణంలో యూరియా కావాలనేది సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం యాప్‌లో సమీపంలోని డీలర్ల సమాచారం ఎంపిక చేసుకోవాలి. మీరు ఎంచుకున్న డీలర్ దగ్గరికి వెళ్లి పేమెంట్ యూరియా తీసుకోవచ్చు. యూరియాలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు పారదర్శకతను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఈ విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది.

Follow Us