ఇవాళ, రేపు రాష్ట్రంలో పర్యటించనున్న తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు...

ఇవాళ, రేపు రాష్ట్రంలో పర్యటించనున్న తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌
Follow us

|

Updated on: Feb 06, 2021 | 4:07 AM

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. నగరం నుంచి నేరుగా ఖమ్మం చేరుకుని ఆదివారం అన్ని డీసీసీల అధ్యక్షులతో సమావేశమై రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. ఆపై ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలపై జిల్లా నేతలతో భేటీ అవుతారు. అనంతరం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్‌ ఉపఎన్నిక, ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై ఆయా ప్రాంత నేతలతో చర్చిస్తారు. సాగర్‌ ఉపఎన్నికపై మిర్యాలగూడలో నల్లగొండ జిల్లా నేతలతో ఠాగూర్ భేటీ అవుతారు.

విశాఖ మానసిక వైద్యశాలకు చేరిన మదనపల్లి జంట హత్యల కేసు కథ, పద్మజ, పురుషోత్తంనాయుడుకి వేరువేరు వార్డుల్లో చికిత్స