ఫుల్ క్లాసు పీకిన కేసీఆర్, అధినేత హెచ్చరికలతో కంగుతిన్న పార్టీ నాయకులు, మరోసారి ఆ టాపిక్ తీయొద్దంటూ గుసగుసలు.!

|

Feb 08, 2021 | 1:53 AM

తెలంగాణ లో సీఎం మార్పు పై కొంత కాలంగా జరుగుతున్న ప్రచారంకు ఫుల్ స్టాప్ పెట్టారు సీఎం కేసీఆర్. తానే సీఎంగా ఉంటా అని...ఇకపై ఎవరైనా ఆ అంశంపై మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని నేతలకు తేల్చి..

ఫుల్ క్లాసు పీకిన కేసీఆర్, అధినేత హెచ్చరికలతో కంగుతిన్న పార్టీ నాయకులు, మరోసారి ఆ టాపిక్ తీయొద్దంటూ గుసగుసలు.!
Follow us on

తెలంగాణ లో సీఎం మార్పు పై కొంత కాలంగా జరుగుతున్న ప్రచారంకు ఫుల్ స్టాప్ పెట్టారు సీఎం కేసీఆర్. తానే సీఎంగా ఉంటా అని…ఇకపై ఎవరైనా ఆ అంశంపై మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని నేతలకు తేల్చి చెప్పారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దాదాపు ఆరు గంటలపాటు తెలంగాణ భవన్ లోనే గడిపిన కేసీఆర్, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం తెలంగాణ భవన్ లో జరిగింది. పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాల పై సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా సుధీర్ఘంగా మాట్లాడారు.

సీఎం మార్పు అంటూ నేతలు మాట్లాడుతున్న తీరుపై సమావేశంలో సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వరుసగా సీఎం మార్పుపై నేతలు మాట్లాడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. నేనే సీఎంగా ఉంటానని నేతలకు తేల్చి చెప్పారు. ఇకపై ఎవరైనా ఈ అంశంపై మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధినేత హెచ్చరికలతో కంగుతిన్న నాయకులు మరోసారి ఆ టాపిక్ తీయొద్దంటూ ఒకరితో ఒకరు మాట్లాడకున్నట్టు సమాచారం. పార్టీ సంస్థాగత నిర్మాణం పై నేతలకు ఈ సందర్భంలో కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.

ఫిబ్రవరి 12 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ప్రారంభిస్తుందని కేసీఆర్ చెప్పారు. ఫిబ్రవరి నెలాఖరు లోపు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని నేతలకు డెడ్ లైన్ పెట్టారు. ఇక మార్చి నెలలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఏప్రిల్ నెలలో రాష్ట్ర కమిటీ ఏర్పాటుతో పాటు, పార్టీ ప్లీనరీ నిర్వహిస్తారు. ఇటు ఏ జిల్లా నాయకులు ముందుకు వస్తే ఆ జిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తామని సమావేశంలో కేసీఆర్ అన్నట్లు సమాచారం.

ఇటు గ్రేటర్ హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లను సీల్డ్ కవర్ లో ఈ నెల 11 న ఇస్తామని పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ప్రకటించారు. 11న గ్రేటర్ ప్రజాప్రతినిధులు కార్పొరేటర్ లతో కలిసి తెలంగాణ భవన్ రావాలని, భవన్ లో అందరూ కలిసి జీహెచ్ఎంసీ వెళ్లాలని కేసీఆర్ ఆదేశించారు. దీంతో మేయర్ ఎవరు అన్నదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మేయర్ ఎన్నిక బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అప్పగించారు కేసీఆర్. మొత్తానికి 6 గంటల పాటు తెలంగాణ భవన్ లో బిజీబిజీగా గడిపిన కేసీఆర్ అనేక అంశాలపై చర్చిండమే కాకుండా మంత్రులు ను సైతం వదలలేదు. జిల్లాల్లో ఎమ్మెల్యేలను మంత్రులు విస్మరించడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుండి ఎమ్మెల్యేలకు తెలియాకుండా నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దని హెచ్చరించారు.

“మీలాంటి వారే.. ఒక రూపాయి చేపకి 20 రూపాయిల మసాలా దినుసులు కొన్నారంట!” : బుచ్చయ్య ‘జగనన్న టమోటో’ కామెంట్