Telangana Employees: తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు.. పదోన్నతుల కోసం ఉద్యోగుల కనీస సర్వీసు కుదింపు

Telangana Employees: తెలంగాణ ఉద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభవార్త వినిపించారు. ఉద్యోగుల పదోన్నతుల దస్త్రంపై సంతకం చేశారు. అయితే నూతన సంవత్సర ...

  • Subhash Goud
  • Publish Date - 5:54 pm, Mon, 11 January 21
Telangana Employees: తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు.. పదోన్నతుల కోసం ఉద్యోగుల కనీస సర్వీసు కుదింపు

Telangana Employees: తెలంగాణ ఉద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభవార్త వినిపించారు. ఉద్యోగుల పదోన్నతుల దస్త్రంపై సంతకం చేశారు. అయితే నూతన సంవత్సర కానుకగా వేతనాలు, పదవీ విరమణ వయస్సును పెంచుతామని ఇప్పటికే కేసీఆర్‌ ప్రకటించగా, తాజాగా పదోన్నతుల విషయంలోనూ ఉద్యోగులకు శుభవార్త వినిపించారు. పదోన్నతుల కోసం కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ రాష్ట్ర సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగుల పదోన్నతుల దస్త్రంపై కేసీఆర్‌ సంతకం చేశారు. సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి  పదోన్నతులపై ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం నిర్ణయంతో అర్హులైన ఉద్యోగులకు ఈ నెలాఖరులోగా పదోన్నతులు లభించనున్నాయి.

కాగా, అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపడతామని కేసీఆర్‌ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులూ కలిపి 9,36,976 మంది ఉంటారని, అందరికి వేతనాల పెంపు వర్తిస్తుందని తెలిపారు. జిల్లా స్థాయిలోని వివిధ శాఖలు, కేటగిరిల్లో ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ను ఇటీవల సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

Schools Reopen: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం.. విద్యాశాఖ అధికారులకు కేసీఆర్‌ ఆదేశం