Schools Reopen: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం.. విద్యాశాఖ అధికారులకు కేసీఆర్‌ ఆదేశం

Schools Reopen: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం కానున్నాయి. 9వ తరగతి ...

Schools Reopen: తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం.. విద్యాశాఖ అధికారులకు కేసీఆర్‌ ఆదేశం
Telangana Schools
Follow us

| Edited By: Team Veegam

Updated on: Jan 11, 2021 | 6:04 PM

Schools Reopen: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం కానున్నాయి. 9వ తరగతి నుంచి ఆపై విద్యార్థులకు తరగతులు నిర్వహిందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులు, కలెక్టర్లు, పంచాయతీరాజ్‌, రెవెన్యూ, మున్సిపల్‌, వైద్య ఆరోగ్య, విద్యాశాఖ, అటవీశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో ప్రధానంగా విద్యాసంస్థల ప్రారంభంపై ఆ శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు కేసీఆర్‌. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ విద్యాసంస్థల నిర్వహణ సాధ్యమేనని అధికారులు తెలుపడంతో కేసీఆర్‌ విద్యాసంస్ధల పునః ప్రారంభానికి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. దీంతో పది నెలలుగా మూతపడిన పాఠశాలలు మరో ఇరవై రోజుల్లో తెరుచుకోనున్నాయి.

Minister KTR: ఆరు అంబులెన్స్‌లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. వీటిని ఏ ఆస్పత్రులకు కేటాయించారంటే..