Telangana: వర్షాల కోసం గ్రామస్థులు కప్పతల్లి ఆటలు.. రోకలికి కప్పని కట్టి ఊరేగింపు

|

Jul 02, 2023 | 11:36 AM

వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని వేడుకుంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల, రేగొండ మండలంలో గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. రోకలి బండకు కొత్త గుడ్డలో ఒక కప్పను కట్టి, దానిని రోకలిబండ మధ్యలో వేలాడదీసి, ఆ కప్పను పసుపు, కుంకుమలతో అలంకరించి ఊరేగించారు. గ్రామంలో ప్రతి ఇంటినుంచి బిందెలలో నీళ్లు తీసుకొచ్చి గ్రామంలో ఆలయాలలో ప్రత్యేకంగా అభిషేకం చేసి, పూజలు నిర్వహించారు.

Telangana: వర్షాల కోసం గ్రామస్థులు కప్పతల్లి ఆటలు.. రోకలికి కప్పని కట్టి ఊరేగింపు
Kappa Talli Ata
Follow us on

ఆరుద్ర కార్తె ఆరంభమైనా వాన జాడేలేదు. రుతుపవనాలు తెలుగురాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చినా ముఖం వర్షాలు  చాటేస్తున్నాయి. వానలు లేక పంట సాగు సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో రైతులు వానదేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. వానలు కురవాలని ఒక్కోప్రాంతంలో ఒక్కోరకంగా దేవతలను ఆరాధిస్తారు. ఒక్కోచోట కప్పలకు పెళ్లి చేస్తే, కొందరు వనాల్లో వంటలు చేసుకొని, బండమీద భోజనం చేస్తూ అడవితల్లిని ఆరాధిస్తారు. తాజాగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో రైతులు కప్పతల్లి ఆడారు.

వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని వేడుకుంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల, రేగొండ మండలంలో గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. రోకలి బండకు కొత్త గుడ్డలో ఒక కప్పను కట్టి, దానిని రోకలిబండ మధ్యలో వేలాడదీసి, ఆ కప్పను పసుపు, కుంకుమలతో అలంకరించి ఊరేగించారు. గ్రామంలో ప్రతి ఇంటినుంచి బిందెలలో నీళ్లు తీసుకొచ్చి గ్రామంలో ఆలయాలలో ప్రత్యేకంగా అభిషేకం చేసి, పూజలు నిర్వహించారు. ఈ ఆచారం తరతరాలుగా వస్తున్నదని, గతేడాది ఆరుద్ర కార్తె ప్రారంభమయ్యేనాటికి అందరూ పంటల సాగులో బిజీగా ఉన్నారు. అయితే ఈ ఏడాది ఇంకా వానజాడే లేకపోవడంతో నాటిన విత్తనాలు కాపాడుకోడానికి స్పింకర్లను ఆశ్రయిస్తున్నామని, వీటిద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. ఇలా కరువు సంభవించినప్పుడు గ్రామదేవతను పూజించి కప్పతల్లి ఆడితే సకాలంలో వర్షాలు కురుస్తాయని, ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయమని తెలిపారు. గతంలో కరువు వచ్చినప్పుడు కూడా కప్పతల్లి ఆట ఆడడం వల్ల వర్షాలు కురిసాయని రైతులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..