అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రకు బయల్దేరారు. ఈరోజు సాయంత్రం జోగులాంబ జిల్లాలో ప్రజాసంగ్రామ యాత్ర-2 ప్రారంభం కానుంది. అంతకముందు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు బండి సంజయ్. ఆయనతో పాటు పార్టీ నేతలు లక్ష్మణ్, రఘునందనరావు, వివేక్ ఇతర దళిత నాయకులు హాజరయ్యారు. అనంతరం పార్టీ ఆఫీసులో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు నాయకులు. ఆ తర్వాత ప్రజా సంగ్రామ యాత్రకు బయల్దేరారు బండి సంజయ్.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో దళితులకు సీఎం కేసీఆర్ తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్. దళిత బంధు దగ్గర్నుంచి.. అంబేద్కర్ విగ్రహ స్థాపన వరకు అంతా అన్యాయమే జరుగుతోందన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర ద్వారా కేసీఆర్ చర్యలను ఎండగడతామని తెలిపారు.
ఇదిలా ఉంటే బండి సంజయ్ సాయంత్రం 4 గంటలకు ఆలంపూర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి.. తర్వాత జోగులాంబ ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఈ రోజుమొత్తం 3 కిలో మీటర్ల మేర పాదయాత్ర నిర్వహించనున్నారు. ఇమ్మాపూర్‌లో రాత్రి బస చేసి.. రేపు మళ్లీ యాత్ర ప్రారంభించనున్నారు. మొత్తం 31 రోజుల పాటు 387కిలో మీటర్ల ఈ పాదయాత్ర సాగనుంది. మే 14న రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ప్రజా సంగ్రామ యాత్ర ముగియనుంది. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరుకానున్నారు.
KCR is only CM who never attended Ambedkar Jayanti.If he remembers Babasaheb at least today,he’ll get his lost senses back.We’ll bring down corrupt-dictatorial regime of KCR who wants to rewrite constitution.BJP will never accept Kalvakuntla constitution. We’ll kill that thought.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) April 14, 2022
Offered prayers to Lord Sri SeethaRama at Mahavir Mutt, Khairtabad and also sought blessings from Lord Hanuman to give me strength in the journey ahead of #PrajaSangramaYatra starting today. pic.twitter.com/QoznE5GLa5
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) April 14, 2022