
చిన్న పిల్లలకు డైపర్లు (Diapers) ప్రధానంగా మూత్ర, మల విసర్జన సమయంలో పరిశుభ్రత, సౌకర్యం, తల్లిదండ్రుల సౌలభ్యం కోసం వాడతారు. ఇవి పసిపిల్లల సున్నితమైన చర్మాన్ని తడి, దద్దుర్లు (Rashes) నుంచి రక్షించి, హాయిగా నిద్రపోవడానికి, కదలికలకు సహాయపడతాయి. ముఖ్యంగా ప్రయాణాల్లో, రాత్రి వేళల్లో తడి దుస్తులను పదేపదే మార్చే పని లేకుండా, ఇల్లు శుభ్రంగా ఉంచడానికి డైపర్లు బాగా ఉపయోగపడతాయి. అందుకే చిన్న పిల్లలకు డైపర్లు వాడుతారు. వృద్ధాప్యంలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి కూడా డైపర్లు వాడుతుంటారు. ఇంట్లో పెంచుకునే పక్షులు రెట్ట వేయకుండా కూడా డైపర్ల మాదిరి ఉండే వాటిని వాడుతుంటారు.
ఇటీవల పెంపుడు కుక్కలకు వ్యాధుల బారిన పడుతున్నాయి. దీంతో సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు వ్యాధుల సోకిన కుక్కలు చికిత్స కోసం వస్తున్నాయి. ముఖ్యంగా పార్వో వైరస్ సోకిన కుక్కలు దుర్వాసనతో కూడిన వాంతులు, రక్తపు విరేచనాలు చేసుకుంటున్నాయి. దీంతో
అంటువ్యాధుల నివారణకు పార్వో వైరస్ సోకిన కుక్కలకు డైపర్ల వాడకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. పశువైద్యశాలలో వైరస్ వ్యాప్తి చెందకుండా వైద్యం కోసం కుక్కలను తీసుకువచ్చే యజమానులు విధిగా డైపర్, డైపర్ షీట్స్ వావాడేలా ప్రోత్సహించి పార్వో వైరస్ వ్యాధి వ్యాప్తిని అరికడుతున్నారు. పార్వో వైరస్ అంటూ వ్యాధుల వ్యాపిస్తుందని, దీని నివారణకు డైపర్లు ఉపయోగపడుతున్నాయని వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ పెంటయ్య చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.