
బంపర్ ఆఫర్.. జస్ట్.. 9 రూపాయలకే చీర.. రండి త్వరపడండి.. అంటూ ఊదరగొట్టారు.. షాపింగ్ ప్రారంభం కోసం ముందస్తుగానే భారీగా ప్రచారం నిర్వహించారు. దీంతో ఆ ప్రాంత వాసులతోపాటు.. చుట్టుపక్కల ప్రాంతాలు వారు కూడా రూ.9కే.. చీర దక్కించుకోవాలని ఆతృతగా ఎదురుచూశారు.. ఆ రోజు రానే వచ్చింది.. హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా షాప్ ప్రారంభోత్సవానికి వచ్చింది. ఇంకేముంది.. తండోపతండాలుగా షాప్ కు తరలివచ్చారు.. దీంతో అందరూ.. ఒకేసారి షాప్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కస్టమర్ల మధ్య తోపులాట జరిగి.. పలువురికి గాయాలయ్యాయి.. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపింది.. జిల్లా కేంద్రంలోనే ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని గరుడ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. హీరోయిన్ మీనాక్షి చౌదరి ఈ మాల్‌ని ప్రారంభించగా.. రూ.9కే చీర ఇస్తామంటూ నిర్వాహకులు ఆఫర్ ప్రకటించారు. దాంతో భారీ ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఈ క్రమంలోనే.. ఒక్కసారిగా లోనికి ప్రవేశించేందుకు యత్నించారు. అయితే.. సెక్యూరిటీ సిబ్బంది మేనేజ్ చేయలేక చేతులు ఎత్తేయడంతో.. తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు మహిళలకు గాయాలయ్యాయి.. చాలాసేపు గందరగోళ వాతావరణం నెలకొనడంతో.. పోలీసులు కష్టపడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..